Tuesday, December 24, 2024

రేపు సైబరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

Traffic restrictions in Cyberabad

ఆదేశాలు జారీ చేసిన డిసిపి శ్రీనివాస్‌రావు

మనతెలంగాణ, సిటిబ్యూరోః ఈ నెల 25వ తేదీన గ్యాథరింగ్ సైక్లింగ్ కమ్యూనిటీ మారథాన్ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ డిసిపి శ్రీనివాస రావు పేర్కొన్నారు. సుమారు వెయ్యిమంది సైక్లిస్టులు కేబుల్ బ్రిడ్జిపై హాజరవుతారని సైక్లింగ్ సంఘం నిర్వాహకులు పేర్కొన్నారు. సైక్లింగ్ నేపథ్యంలో ఐటిసి కోహినూర్, ఐకియా, రోటరీ, కేబుల్ బ్రిడ్జి, ఎన్‌సిబి జంక్షన్, గచ్చిబౌలి రోడ్డు నంబర్ 45, దుర్గం చెరువు, జూబ్లీహిల్‌స ఇనార్బిట్ మాల్, సిఓడి జంక్షన్ ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని పేర్కొన్నారు. ఉదయం 8 గంటల తర్వాత డైవర్షన్స్ తీసివేసి ట్రాఫిక్‌ను యధావిధిగా కొనసాగిస్తామని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News