Monday, January 20, 2025

సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః ఫోర్‌స్ట్రీక్ పార్క్ ప్రారంభం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ సైబరాబాద్ జాయింట్ పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు శనివారం ఉదయం 9 గంటల నుంచి ఉండనున్నాయి. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని కోరారు.
నార్సింగి నుంచి టిఎస్‌పిఏ మీదుగా సర్వీస్ రోడ్డు 1 నుంచి వచ్చే వారు నార్సింగి రోటరీ 1, నార్సింగి రోటరీ2 వద్ద రైటర్న్ తీసుకుని ఎన్‌సిసి అర్బన్ సర్వీస్ రోడ్డు, నార్సింగి న్యూ డౌన్ ర్యాంప్, రైటర్న్ తీసుకుని మంచిరేవుల ఎక్స్ రోడ్డు, చేవెళ్ల రోడ్డు, లెఫ్ట్ తీసుకుని టిఎస్‌పిఏ రోటరీ వైపు వెళ్లాలి.

టిఎస్‌పిఏ నుంచి నార్సింగి వైపు వచ్చే వారు వ్యాస్‌నగర్ అండర్‌పాస్, లెఫ్ట్ తీసుకుని, తర్వాత రైటర్న్ తీసుకుని సర్వీస్ రోడ్డు 2, నార్సింగి రోటరీ వైపు వెళ్లాలి.
టిఎస్‌పిఏ సర్కిల్…
టిఎస్‌పిఏ నుంచి నార్సింగి వచ్చే భారీ వాహనాలు టిఎస్‌పిఏ రోటరీ 1, టిఎస్‌పిఏ రోటరీ 2, ఆర్‌ఆర్ అప్ ర్యాంప్, నార్సింగి న్యూ డౌన్ ర్యాంప్, లెఫ్ట్ టర్న్, నార్సింగి రోటరీ 2, నార్సింగి రోటరీ 1 వైపు వెళ్లాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News