Monday, December 23, 2024

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః గణేష్ నిమజ్జనం సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆంక్షలు విధిస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషర్ స్టిఫెన్ రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు ఈ నెల 26వ తేదీ నుంచి 29వ తేదీ వరకు అమలులో ఉంటాయని పేర్కొన్నారు.

ఐడిఎల్ ట్యాంక్, కూకట్‌పల్లి…
ఐడిఎల్ ట్యాంక్ వైపు సందర్శకుల వాహనాలను అనుమతించరు.
కూకట్‌పల్లి వై జంక్షన్ నుంచి హైటెక్ సిటీ, మాదాపూఱ్ వైపు వెళ్లే వారు జెఎన్‌టియూ, ఫోరం మాల్ రోడ్డు మీదుగా వెళ్లాలి.
హైటెక్ సిటీ, మాదాపూర్ నుంచి కూకట్ పల్లి వై జంక్షన్ వైపు వచ్చే వాహనాలు ఖైత్లాపూర్ నుంచి రేయిన్‌బో విస్టా, మూసాపేట్ రోడ్డు మీదుగా కూకట్‌పల్లి వై జంక్షన్, బాలానగర్ వైపు వెళ్లాలి.

సూరారం కట్టమైసమ్మ ట్యాంక్…
బాలానగర్, జీడిమెట్ల నుంచి బహదూర్‌పల్లి, బాచుపల్లి, గండిమైసమ్మ జంక్షన్ వైపు వచ్చే వాహనాలను సూరారం విలేజ్ సమీపంలో సబ్ రిజిస్టార్ ఆఫీస్, బోరంపేట, గండిమైసమ్మ వైపు వెళ్లాలి.
గండిమైసమ్మ, బాచుపల్లి నుంచి జీడిమెట్ల, బాలానగర్ వెళ్లే వాహనాలు బహదూర్‌పల్లి జంక్షన్ వద్ద నుంచి లెఫ్ట్ తీసుకుని దూలపల్లి గ్రామం టి జంక్షన్, ఇండస్ట్రీయల్ ఏరియా, జీడిమెట్ల వైపు వెళ్లాలి.

హస్మత్‌పేట్ ట్యాంక్, అల్వాల్…
బోయిన్‌పల్లి, సికింద్రాబాద్ నుంచి వచ్చే వినాయకుడి విగ్రహాలను హస్మత్‌పేట ట్యాంక్‌కు అంజయ్యనగర్ మీదుగా తీసుకుని రావాలి. నిమజ్జనం తర్వాత వాహనాలతో బోయిన్‌పల్లి, మసీద్ రోడ్డు, హరిజన్ బస్తీ నుంచి వెళ్లాలి.

ఫ్లై ఓవర్లపైకి అనుమతి లేదు…
– వినాయకుడి విగ్రహాలను తీసుకుని వచ్చే వాహనాలకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఫ్లైఓవర్లపైకి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఫతేనగర్, హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్ ఫ్లైఓవర్,ఫోరంమాల్ ఫ్లైఓవఱ్,బాబు జగ్జివన్‌ణ రామ్ ఫ్లైఓవర్(బాలానగర్), ఖైత్లాపూర్ ఫ్లైఓవర్‌పైకి వాహనాలకు అనుమతిలేదు.

భారీ వాహనాలకు అనుమతిలేదు…
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధికి సంఘారెడ్డి నుంచి కూకట్‌పల్లి వైపు వచ్చే వాహనాలకు అనుమతి లేదు, వాటిని ఓఆర్‌ఆర్‌వైపు డైవర్ట్ చేస్తారు.
బాలానగర్ నుంచి ఫతేనగర్ బ్రిడ్జి.
గోద్రేజ్ టూ ఎర్రగడ్డ, ఫిరోజ్ గూడ నుంచి గోద్రేజ్ వై జంక్షన్, కూకట్‌పల్లి, గూడెంమెట్ నుంచి నర్సాపూర్ ఎక్స్ రోడ్డు,
అశోక్ నగర్, బీరమ్మగూడ నుంచి బాచుపల్లి, గండిమైసమ్మ నుంచి ఓఆర్‌ఆర్ వైపు అనుమతి లేదు.

రోడ్డు డైవర్షన్…
బిహెచ్‌ఈఎల్, చందానగర్, మియాపూర్ నుంచి అమీర్‌పేటకు వెళ్లే భారీ వాహనాలను మియాపూర్ ఎక్స్ రోడ్డు నుంచి లెఫ్ట్ తీసుకుని బాచుపల్లి, బోరంపేట్, గండిమైసమ్మ వద్ద లెఫ్ట్ తీసుకుని ఓఆర్‌ఆర్‌పైకి వెళ్లాలి.
గచ్చిబౌలి,పటాన్‌చెరువు మీదుగా ఆరాంఘర్, అత్తాపూర్ వెళ్లే వాహనాలను ఎగ్జిట్ 17వద్ద(హిమాయత్‌సాగర్)దిగేందుకు అనుమతిలేదు. వీరు స్ట్రేట్‌గా వెళ్లి ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ నంబర్ 16వద్ద(శంషాబాద్) వద్ద దిగాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News