Monday, December 23, 2024

ఈ నెల 4న సైబరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

హైదారాబాద్: సైక్లింగ్ ఓట్, వాకథాన్ అవగాహన కార్యక్రమం నిర్వహించనున్న సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 4వ తేదీన ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ జాయింట్ సిపి ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు ఉదయం 5.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు అమలులో ఉండనున్నాయి. సైక్లింగ్, వాకథాన్ పోటీలను కేబుల్ బ్రిడ్జి మధ్య నుంచి ఇన్‌ఆర్బిట్‌మాల్, మై హోం అబ్రా యూ టర్న్, ఐటిసి కోహినూర్ నుంచి మళ్లీ కేబుల్ బ్రిడ్జి వద్ద ముగియనుంది. భారీ వాహనాలకు అనుమతిలేదు. సిఓడి నుంచి దుర్గంచెరువు, ఐటిసి కోహినూర్ నుంచి ఐకియా రోటరీ, ఐకియా రోటరీ నుంచి ఐటిసి కోహినూర్ వైపు భారీ వాహనాలను అనుమతించరు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News