Monday, December 23, 2024

ఆదివారం సైబరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

 

మనతెలంగాణ, హైదరాబాద్ : ఈ నెల 13వతేదీన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ ట్రాఫిక్ డిసిపి శ్రీనివాసరావు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 6 గంటల నుంచి 8గంటల వరకు 3కెఎం, 5కెఎం రన్నింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో ఆంక్షలు విధించారు. వాహనదారులు ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని కోరారు.

రోడ్డు నంబర్ 45 నుంచి ఐటిసి కోహినూర్, ఐకియా వైపు వచ్చే వాహనాలను రోడ్డు నంబర్ 45 వద్ద రైటర్న్ తీసుకుని డి మార్ట్, మాదాపూర్ పిఎస్ వద్ద లెఫ్ట్, సిఓడి జంక్షన్, నెక్టార్ గార్డెన్, ఐటిసి కోహినూర్, కెఆర్‌సి హెటీరో ప్రాజెక్ట్, టిహబ్ లేదా ఐకియా రోటరీ వైపు వెళ్లాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News