Wednesday, January 22, 2025

గచ్బిబౌలిలో ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని కోరారు.
బయోడైవర్సిటీ జంక్షన్ నుంచి ఐఐఐటి జంక్షన్ వైపు వెళ్లే వాహనాలు బిచ్చారెడ్డి స్వీట్స్(టెలీకాం నగర్) నుంచి గచ్చిబౌలి జంక్షన్ నుంచి ఐఐఐటి జంక్షన్ వైపు వెళ్లాలి.
ఐఐఐటి జంక్షన్ నుంచి బయోడైవర్సీటీ జంక్షన్ బైపాస్ ఫ్లైఓవర్ నుంచి గచ్బిచౌలి జంక్షన్ నుంచి బయోడైవర్సిటీ జంక్షన్ వైపు వెళ్లాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News