Saturday, December 21, 2024

డబ్ల్యూడబ్ల్యూఈ మ్యాచ్.. గచ్చిబౌలిలో ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌స్టార్ స్పెక్టాకిల్ ఈవెంట్‌ను నిర్వహించనున్న దృష్ట్యా గచ్చిబౌలి నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) రోడ్డులో మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. సైబరాబాద్ పోలీసులు జారీ చేసిన సలహా ప్రకారం, గచ్చిబౌలి జంక్షన్ నుండి హెచ్‌సియు వైపు వెళ్లే వాహనదారులు కొండాపూర్ రహదారిపై వెళ్లాలని సూచించారు.

అలాగే నల్లగండ్ల నుంచి గచ్చిబౌలి జంక్షన్‌కు వచ్చే వాహనదారులు మసీదు బండ – కొండాపూర్ – బొటానికల్ గార్డెన్ మార్గంలో వెళ్లాలని కోరారు. 16 సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన జాన్ సెనా హైదరాబాదు పర్యటనకు రావడంతో భారతీయ డబ్ల్యూడబ్ల్యూఈ ఔత్సాహికుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. WWE అభిమానులు బుక్ మై షోలో ఈవెంట్ కోసం తమ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. అదనంగా, పౌరులు సోనీ స్పోర్ట్స్ ఛానెల్‌లలో కూడా మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News