Saturday, November 9, 2024

హైటెక్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

Traffic restrictions in high-tech areas

హైదరాబాద్ : టిఆర్‌ఎస్ ప్లీనరీ నిర్వహించనున్న నేపథ్యంలో బుధవారం హైటెక్స్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు. హైటెక్స్ పరిసరాల్లో ఉదయం 8.30 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి.

నీరూస్ జంక్షన్, సైబర్ టవర్స్ జంక్షన్, మెటల్ చార్మినార్ జంక్షన్, గూగుల్ జంక్షన్, కొత్తగూడ జంక్షన్ రోడ్డు

మెటల్ చార్మినార్ జంక్షన్, ఖానామెట్ జంక్షన్, హైటెక్స్ లేదా హెచ్‌ఐసిసి, నాక్ రోడ్డు.

జెఎన్‌టియూ, సైబర్ టవర్స్, బయోడైవర్‌సిటీ జంక్షన్.

గచ్చిబౌలి జంక్షన్, బొటానికల్ గార్డెన్ జంక్షన్, కొత్తగూడ జంక్షన్, కొండాపూర్ జంక్షన్.

ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి, వాహనదారులు ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు కోరారు.

నీరూస్ నుంచి గచ్చిబౌలి జంక్షన్ వచ్చే వాహనాలను అయ్యప్ప సొసైటీ మీదుగా దుర్గం చెరువు, ఇన్‌ఆర్బిట్‌మల్, ఐటిసి కోహినూర్, ఐకియా, బయోడైవర్సిటీ, గచ్చిబౌలి వైపు ట్రాఫిక్‌ను మళ్లిస్తారు.

మియాపూర్, కొత్తగూడ, హఫీజ్‌పేట మీదుగా హైటెక్ సిటీ, సైబర్ టవర్స్, జూబ్లీహిల్స్ వచ్చే వాహనాలు రోలింగ్ హిల్స్ ఎఐజి ఆస్పత్రి, ఐకియా, ఇన్‌ఆర్బిట్‌మాల్, దుర్గం చెరువు రోడ్డువైపు మళ్లిస్తారు.

ఆర్‌సి పురం, చందానగర్ నుంచి మాదాపూర్, గచ్చిబౌలి వైపు వచ్చే వాహనాలను బిహెచ్‌ఈఎల్, నల్లగండ్ల, హెచ్‌సియూ, ఐఐఐటి, గచ్చిబౌలి రోడ్డువైపు మళ్లిస్తారు.

జెఎన్‌టియూ నుంచి సైబర్ టవర్స్, మియాపూర్, కొత్తగూడ, కావూరిహిల్స్ మీదుగా కొత్తగూడ, బయోడైవర్సిటీ మీదుగా జెఎన్‌టియూ, నారాయణమ్మ కాలేజీ మీదుగా గచ్చిబౌలికి వెళ్లే భారీ వాహనాలకు అనుమతి లేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News