Friday, April 11, 2025

నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, హైదరాబాద్ : రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్ పరిసరాల్లో 26వ తేదీ సాయంత్రం ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ ట్రాఫిక్ సిపి ఆదేశాలు జారీ చేశారు. సోమాజిగూడ జంక్షన్ నుంచి వివి స్టాట్యూ జంక్షన్ సాయంత్రం 3 గంటల నుంచి 9 గంటల వరకు ఆంక్షలు విధించారు. సోమాజిగూడ, మోనప్పా ఐస్‌ల్యాండ్, రాజ్‌భవన్ మెట్రో స్టేషన్, వివి స్టాట్యూ జంక్షన్ పరిసరాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. రాజ్‌భవన్ క్వార్టర్స్ రోడ్డును పూర్తిగా మూసివేయనున్నారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News