Wednesday, January 22, 2025

రేపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

బిజేపి ఎన్నికల ప్రచార సభ నేపథ్యంలో ఎల్‌బి స్టేడియం పరిసరాల్లో శుక్రవారం ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ ఆదేశాలు జారీ చేశారు. ఎల్‌బి స్టేడియంలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని వాహనదారులు ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని కోరారు.
– ప్రధాని బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ఎల్‌బి స్టేడియం వరకు వచ్చే రూట్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బేగంపేట ఎయిర్ పోర్టు, ఎయిర్ పోర్టు వై జంక్షన్, పిఎన్‌టి ఫ్లైఓవర్, షాపర్ స్టాప్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బేగంపేట ఫ్లైఓవర్, గ్రీన్స్‌ల్యాండ్, రాజీవ్ గాంధీ స్టాట్యూ, యశోద ఆస్పత్రి, ఎంఎంటిఎస్, రాజ్‌భవన్, వివి స్టాట్యూ, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, నెక్లెస్ రోడ్డు, ఎన్‌టిఆర్ మార్గ్, తెలుగుతల్లి జంక్షన్, ఇక్బాల్ మినార్,రవీంద్రభారతీ, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ జంక్షన్, ఎఆర్ పెట్రోల్ పంప్ లెఫ్ట్ టర్న్, ఎల్‌బి స్టేడియం. సభ ముగిసిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇదే రూట్‌లో తిరిగి బేగంపేట ఎయిర్ పోర్టుకు వెళ్లనున్నారు.
– ఎఆర్ పెట్రోల్ పంప్ జంక్షన్ నుంచి బిజేఆర్ స్టాట్యూ మీదుగా వచ్చే వాహనాలను ఎఆర్ పెట్రోల్ పంప్ మీదుగా నాంపల్లి వైపు మళ్లిస్తారు.

– బషీర్‌బాగ్ నుంచి ఎఆర్ పెట్రోల్ పంప్ మీదుగా వెళ్లే వాహనాలను బిజెఆర్ విగ్రహం మీదుగా ఎస్‌బిహెచ్, అబిడ్స్, నాంపల్లి స్టేషన్ రోడ్డు వైపు వెళ్లాలి.
– సుజాతా స్కూల్ లేన్ నుంచి ఖాన్ లతీఫ్ ఖాన్ మీదుగా వచ్చే వాహనాలు సూజాతా స్కూల్ జంక్షన్ మీదుగా నాంపల్లి వైపు మళ్లిస్తారు.
రద్దీ ఉండే జంక్షన్లు….
రసూల్‌పుర, పిఎన్‌టి జంక్షన్, బేగంపేట ఫ్లైఓవర్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, గ్రీన్స్‌ల్యాండ్, పంజాగుట్ట, వివి స్టాట్యూ, రాజీవ్ గాంధీ స్టాట్యూ, నిరంకారీ, సైఫాబాద్ ఓల్డ్ పిఎస్, లకిడికాపూల్, ఇక్బాల్ మినార్, రవీంద్ర భారతి, హైదారబాద్ ట్రాఫిక్ పోలీస్ జంక్షన్, బషీర్‌బాగ్, బిజెఆర్ స్టాట్యూ సర్కిల్, ఎస్‌బిఐ గన్‌ఫౌండ్రీ, అబిడ్స్ సర్కిల్, ఎఆర్ పెట్రోల్ పంప్, నాంపల్లి, కెఎల్‌కె బిల్డింగ్, లిబర్టీ, హిమాయత్‌నగర్, అసెంబ్లీ, ఎంజే మార్కెట్, హైదర్‌గూడ జంక్షన్లు రద్దీగా ఉండనున్నాయి. ఈ జంక్షన్లను వాహనదారులు అవాయిడ్ చేయాలని ట్రాఫిక్ పోలీసులు కోరారు.

ఆర్‌టిసి బస్సులు…
రవీంద్ర భారతి మీదుగా బిజేఆర్ స్టాట్యూ నుంచి వెళ్లే ఆర్‌టిసి బస్సులు ఎల్‌బి స్టేడియం మేయిన్ గేట్ మీదుగా వెళ్లకూడదు. ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్ ముందు నుంచి ఎఆర్ పెట్రోల్ పంప్ మీదుగా నాంపల్లి వైపు వెళ్లాలి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News