Monday, January 20, 2025

నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వేడుకల నేపథ్యంలో ఈ నెల 2వ తేదీన గన్‌పార్క్, పరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మేరకు ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని కోరారు.
గన్‌పార్క్ పరిసరాల్లో ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి.
ఓల్డ్ సైఫాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి హెచ్‌టిపి వైపు వెళ్లే వాహనాలు ఇక్బాల్ మినార్ జంక్షన్ వైపు మళ్లించారు.
ఎఆర్ పెట్రోల్ పంప్ నుంచి నాంపల్లి వైపు వచ్చే వాహనాలను రవీంద్రభారతి వైపు అనుమతించరు. ఎఆర్ పెట్రోల్ పంప్ మీదుగా జిజెఆర్ స్టాట్యూ వైపు మళ్లిస్తారు.

పరేడ్ గ్రౌండ్…
పరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
— ఆలుగడ్డబావి, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి వచ్చే వాహనాలను సంగీత్ క్రాస్ రోడ్డు మీదుగా క్లాక్ టవర్, ప్యాట్నీ, ప్యారడైజ్ వైపు మళ్లిస్తారు.
– – తుకారాంగేట్ నుంచి వచ్చే వాహనాలను సెయింట్ జాన్స్ రోటరీ మీదుగా సంగీత్ క్రాస్ రోడ్డు, క్లాక్ టవర్ , ప్యాట్నీ, ప్యారడైజ్ వైపు రావాలి.
— సంగీత్ క్రాస్ రోడ్డు నుంచి బేగంపేట వైపు వచ్చే వాహనాలను వైఎంసిఏ మీదుగా క్లాక్ టవర్, ప్యాట్నీ, ప్యారడైజ్, సిటిఓ, రసూల్‌పుర, నుంచి బేగంపేట వైపు మళ్లిస్తారు.
– – బేగంపేట నుంచి సంగీత్ క్రాస్ రోడ్డు వైపు వచ్చే వాహనాలను సిటిఓ ఎక్స్ రోడ్డు మీదుగా బాలంరాయ్, బ్రూక్ బాండ్, టివోలి,స్వీకర్ ఉపకార్, వైఎంసిఏ, సెంట్ జాన్స్ రోటరీ నుంచి సంగీత్ క్రాస్ రోడ్డు వైపు వెళ్లాలి.
– – – బోయిన్‌పల్లి, టాడ్‌బండ్ మీదుగా టివోలి వైపు వెళ్లే వాహనాలను బ్రూక్‌బాండ్ మీదుగా సిటిఓ వైపు మళ్లిస్తారు.
– — కార్ఖాన, జెబిఎస్ మీదుగా ఎస్‌బిహెచ్ ప్యాట్నీ వైపు వచ్చే వాహనాలను స్వీకర్ ఉపకార్ మీదుగా టివోలి, బ్రూక్‌బాండ్, బాలమ్‌రాయ్, సిటిఓ వైపు మళ్లిస్తారు.
– – – కార్ఖాన, జెబిఎస్ మీదుగా ఎస్‌బిహెచ్ ప్యాట్నీ నుంచి వచ్చే వాహనాలను స్వీకర్, ఉపకార్, మీదుగా వైఎంసిఏ, క్లాక్ టవర్, ప్యాట్నీ మీదుగా మళ్లిస్తారు.
— ఎస్‌బిఐ నుంచి వచ్చే వాహనాలను స్వీకర్ ఉపకార్ నుంచి వైఎంసిఏ, సిటిఓ వైపు మళ్లిస్తారు.
— – ఆర్‌టిఏ తిరుమలగిరి, కార్ఖాన, మల్కాజ్‌గిరి, సఫిల్‌గూడ మీదుగా ప్లాజా వైపు వచ్చే వాహనాలను టివోలి మీదుగా స్వికర్, ఉపకార్, వైఎంసిఏ, బ్రూక్‌బాండ్, బాలమ్‌రాయ్, సిటిఓ వెళ్లాలి.
– – ట్రాఫిక్ రద్దీ ఏర్పడితే టివోలి అండ్ క్లబ్ నుంచి వచ్చే వాహనాలను బోయిన్‌పల్లి మార్కెట్, ఎఓసి వైపు మళ్లిస్తారు.
— జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి బేగంపేట నుంచి వచ్చేవాహనాలను పంజాగుట్ట మీదుగా ఖైరతాబాద్, గ్రీన్స్‌ల్యాండ్ మీదుగా రాజ్‌భవన్ వైపు మళ్లిస్తారు.

రద్దీ ఉండే జంక్షన్లు…
చిలకలగూడ క్రాస్ రోడ్డు, ఆలుగడ్డ బావి క్రాస్ రోడ్డు, సంగీత్ క్రాస్ రోడ్డు, వైఎంసిఏ క్రాస్ రోడ్డు,ప్యాట్నీ క్రాస్ రోడ్డు, ఎస్‌బిహెచ్ క్రాస్ రోడ్డు, ప్లాజా, సిటిఓ జంక్షన్, బ్రూక్‌బాండ్ జంక్షన్, టివోలి జంక్షన్, స్వీకర్ ఉపకార్ జంక్షన్, సికింద్రాబాద్ క్లబ్, తిరుమలగిరి క్రాస్ రోడ్డు, తాడ్‌బండ్ క్రాస్ రోడ్డు, సెంటర్ పాయింట్, డైమండ్ పాయిట్, బోయిన్‌పల్లి క్రాస్ రోడ్డు, రసూల్‌పుర, బేగంపేట, పారడైజ్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News