Wednesday, January 22, 2025

శ్రీకృష్ణాజన్మాష్టమి సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ అదపు పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ విశ్వప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 26వ తేదీ ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. ఇస్కాన్ టెంపుల్, అబిడ్స్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని వాహనదారులు ప్రత్యామ్నాయమార్గంలో వెళ్లాలని కోరారు.
గన్‌ఫ్రౌండీ, తిలక్ రోడ్డు నుంచి నాంపల్లి స్టేషన్ వైపు వచ్చే వాహనాలను అనుమతించరు, వాటిని జిపిఓ జంక్షన్ నుంచి ఎంజే మార్కెట్ వైపు మళ్లిస్తారు.

ఎంజే మార్కెట్ నుంచి జిపిఓ జంక్షన్ వైపు వచ్చే వాహనాలను అనుమతించరు. వాహనాలను ఎంజే మార్కెట్ మీదుగా నాంపల్లి వైపు మళ్లిస్తారు.
నాంపల్లి నుంచి కోఠి బ్యాంక్ స్ట్రీట్ వైపు వచ్చే వాహనాలను భారత్ పెట్రోల్ పంప్, ఎసిబి లేన్, యూసుఫ్ అండ్ కంపెనీ, ట్రూప్ బజార్, కోఠి బ్యాంక్ స్ట్రీట్ వైపు మళ్లిస్తారు.
బిజేపి స్టేట్ ఆఫీస్ నుంచి ఓల్డ్ కలెక్టరేట్ ఆఫీస్ జంక్షన్ వైపు వాహనాలను అనుమతించరు. ఎంజే మార్కెట్ రోడ్డు వైపు మళ్లిస్తారు.
పార్కింగ్…
ఇస్కాన్ టెంపుల్‌కు వచ్చే వారు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో, వసంత్ వీహార్ ఓపెన్ ఎరియాలో వాహనాలను పార్కింగ్ చేయాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News