వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ విశ్వప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు ఉదయం 11 గంటల నుంచి అర్ధరాత్రి వరకు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని కోరారు. సెప్టెంబర్7వ తేదీ నుంచి ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం పూర్తయ్యే 17వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. పది రోజులు ఉదయం 11 గంటల నుంచి అర్థరాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు అందుబాటులో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
ఖైరతాబాద్ విశ్వేశ్వరాయ విగ్రహం నుంచి రాజీవ్ గాంధీ విగ్రహం మీదుగా మింట్ కాంపౌండ్ వైపు సాధారణ ట్రాఫిక్‌ను అనమతించరు. రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి నిరంకారి జంక్షన్ వైపు ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
సైఫాబాద్ పాత పోలీస్ నుంచి ఖైరతాబాద్ బడా గణేష్ వైపు రాజ్ దూత్ లేన్‌లోకి సాధారణ ట్రాపిక్‌ను అనుమతించరని, ఇక్బాల్ మినార్ వైపు వాహనాలను అనుమతించరు.
సాధారణ వాహనాలను ఇక్బాల్ మినార్ నుంచి మింట్ కాంపౌండ్ లేన్ వైపు అనుమతించరు. మింట్ కాంపౌండ్ లేన్ ఎంట్రన్స్ నుంచి వాహనాలను తెలుగు తల్లి జంక్షన్ వైపు మళ్లిస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు.
ఎన్టీఆర్ మార్గ్/ఖైరతాబాద్ ఫ్లైఓవర్/ నెక్టెస్ రోడ్ నుంచి మింట్ కాంపౌండ్ వైపు సాధారణ ట్రాఫిక్‌ను అనుమతించరు. నెక్టెస్ రోడ్‌లో రోటరీ నుంచి తెలుగు తల్లి జంక్షన్ వైపు, ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వైపు మళ్లిస్తారు.
నిరంకారి నుంచి సాధారణ ట్రాఫిక్‌ను ఖైరతాబాద్ పోస్టాఫీసు లేన్, ఖైరతాబాద్ రైల్వే గేట్ వైపు అనుమతించరు. పోస్టాఫీసు వద్ద ఓల్ సైఫాబాద్ జంక్షన్ వైపు కూడా వాహనాలను అనుమతించరు.
సెలవు రోజుల్లో…
సెలవు రోజుల్లో ఖైరతాబాద్ బడా గేణేశుడి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖైరతాబాద్, షాదన్ కాలేజ్, నిరంకారి, ఓల్ సైఫాబాద్ పోలీస్ స్టేషన్, మింట్ కాంపౌండ్ ప్రాంతాలు రద్దీగా ఉంటాయని, సెలవు రోజుల్లో ఈ మార్గాల్లో వావాహనదారులు రావొద్దని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
పార్కింగ్ స్థలాలు ఇవే..
నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ గార్డెన్ మీదుగా బడా గణేష్ దర్శనానికి వచ్చే సందర్శకులు తమ వాహనాలను ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ పక్కన అంబేద్కర్ స్క్వేర్ పార్కింగ్ స్థలంలో, ఎన్టీఆర్ గార్డెన్ పార్కింగ్ ప్లేస్‌తో పాటు సరస్వతి విద్యా మందిర్ హైస్కూల్ ప్రాంగణం, రేస్ కోర్స్ రోడ్ పార్కింగ్ ప్లేస్‌లో వాహనాలను పార్క్ చేయాలని పోలీసులు సూచించారు.