Monday, December 23, 2024

నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

షీటీమ్స్ 5కె, 2.5కె రన్

హైదరాబాద్: హైదరాబాద్ పోలీస్ షీటీమ్స్ నిర్వహించనున్న 5కె, 2.5కె రన్ సందర్భంగా సోమవారం ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ అదనపు పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ ఆదేశాలు జారీ చేశారు. షీటీమ్స్ ఆధ్వర్యంలో 5కె, 2.5కె రన్స్‌ను నెక్లెస్ రోడ్డు నుంచి ట్యాంక్‌బండ్ వరకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సోమవారం ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గంలో వెళ్లాలని కోరారు. వివి స్టాట్యూ నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్, నెక్లెస్‌రోటరీ నుంచి వివి స్టాట్యూ మీదుగా షాదన్, నిరంకారీ భవన్ వైపు మళ్లి స్తారు.

తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి వచ్చే వాహనాలను ఎన్‌టిఆర్ మార్గ్‌వైపు అనుమతించరు, ఇక్బాల్ మినార్ వైపు మళ్లిస్తారు.
ఇక్బాల్ మినార్ నుంచి అప్పటర్ ట్యాంక్‌బండ్ వెళ్లే వాహనాలను తెలుగుతల్లి ఫ్లైఓవర్ ఓల్డ్ గేట్ సెక్రటేరియట్ వైపు మళ్లిస్తారు.
లిబర్టీ నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్‌వైపు వచ్చే వాహనాలను అంబేద్కర్ స్టాట్యూ మీదుగా తెలుగుతల్లి, ఇక్బాల్ మినార్ వద్ద యూటర్న్ తీసుకుని తెలుగుతల్లి ఫ్లైఓవర్ వైపు వెళ్లాలి.

కర్బాలా మైదాన్ నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు వెళ్లే వాహనాలను చిల్డ్రన్స్ పార్క్ మీదుగా డిబిఆర్ మిల్స్ వైపు మళ్లిస్తారు. కవాడిగూడ ఎక్స్ రోడ్డు నుంచి సేయిలింగ్ క్లబ్ వైపు అనుమతించరు. డిబిఆర్ మిల్స్ నుంచి వచ్చే వాహనాలను చిల్డ్రన్స్ పార్క్ వైపు వాహనాలను అనుమతించరు. మినిస్టర్స్ రోడ్డు, రాణిగంజ్ నుంచి నెక్లెస్‌రోడ్డు వైపు వచ్చే వాహనాలను నల్లగుట్ట జంక్షన్ మీదుగా రాణిగంజ్, మినిస్టర్ రోడ్డు వైపు మళ్లిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News