Tuesday, January 21, 2025

15 న నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః గోల్కొండలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 15వ తేదీ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని కోరారు.
రాందేవ్‌గూడ నుంచి గోల్కొండ ఫోర్ట్ రోడ్డును ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు మూసివేస్తారు.
రాందేవ్‌గూడ నుంచి గోల్కొండ ఎంట్రీ నుంచి ఏ(గోల్డ్), ఎ(పింక్), బి(బ్లూ) కారు పాస్ ఉన్న వారు ఎంట్రీ కావాలి.
సికింద్రాబాద్, బంజారాహిల్స్, మాసబ్‌ట్యాంక్, మెహిదీపట్నం నుంచి వచ్చే వారు రేతిబౌలి, నానాల్ నగర్ జంక్షన్ నుంచి లెఫ్ట్ తీసుకుని బాలిక భవన్, లంగర్‌హౌస్ ఫ్లైఓవర్, టిప్పు ఖాన్ బ్రిడ్జి, రాందేవ్‌గూడ జంక్షన్ రైటర్న్ తీసుకుని మకాయ్ దర్వాజ నుంచి గోల్కొండ ఫోర్ట్ గేట్ వైపు రావాలి.

గోల్డ్ కారు పాస్ ఉన్న వారు వాహనాలను కోట మెయిన్ రోడ్డుకు ఇరువైపులా పార్కింగ్ చేయాలి.
పింక్ కారు పాస్ ఉన్న వారు వాహనాలను గోల్కొండ బస్‌స్టాప్ వద్ద పార్కింగ్ చేయాలి.
బ్లూ కారు పాస్ ఉన్నవారు వాహనాలను ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో వాహనాలను పార్కింగ్ చేయాలి.
సి కారు పాసు ఉన్న వారు సెవెన్ టూంబ్స్, బంజారా దర్వాజ, ఫతే దర్వాజ వద్ద రైటర్న్ తీసుకుని బడా బజార్ మీదుగా జిహెచ్‌ఎంసి ఐస్‌ల్యాండ్, ఓవైసి గ్రౌండ్‌లో వాహనాలను పార్కింగ్ చేయాలి.
రెడ్(డి) కారు పాస్ ఉన్న వారు గోల్కొండ కోట, వయా షేక్‌పేట నాలా, టోలీచౌకి, సెవెన్ టూంబ్స్, బంజారా దర్వాజ, ప్రియదర్శిని స్కూల్, గోల్కొండకు రావాలి. వాహనాలను ప్రియదర్శిని పాఠశాలలో పార్కింగ్ చేయాలి.
బ్లాక్(ఈ) పాస్ ఉన్న వారు లంగర్‌హౌస్ ఫ్లైఓవర్ వద్ద యూటర్న్ తీసుకుని ఫతేదర్వాజ నుంచి రావాలి. వాహనాలను హుడాపార్క్‌లో పార్కింగ్ చేయాలి. ఫతేదర్వాజా నుంచి సాధారణ ప్రజలు షేక్‌పేట, టోలీచౌకి నుంచి రావాలి. ఆర్‌టిసి బస్సులు ఈ రూట్‌లో రావాలి.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ముగిసిన తర్వాత ఏ, బి కారు పాస్ ఉన్న వారు మాకీ దర్వాజా, రాందేవ్‌గూడ, లంగర్‌హౌస్ నుంచి బయటికి రావాలి. సి పాస్ ఉన్న వారు బడా బజార్, ఫేతేదర్వాజ, బంజారాదర్వాజా, సెవెన్ టూంబ్స్, డి కారు పాస్ ఉన్న వారు బంజారాదర్వాజా, సెవెన్‌టూంబ్స్, ఈ కారు పాస్ ఉన్న సాధారణ ప్రజలు వెళ్లిన నుంచి బయటికి రావాలి.
లెప్ట్ సైడ్ స్క్రీన్‌పై పాస్ ఉండాలి…
స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు వచ్చే వారు కారు పాస్‌ను కారు స్క్రీన్ లెఫ్ట్ సైడ్‌లో అతికించాలి. ఆహ్వానితులు వారికి పంపించిన ఇన్విటేషన్ కార్డును తీసుకుని రావాలని పోలీసులు కోరారు. వారికి నిర్ధేశించిన ప్రాంతంలో కార్లను పార్కింగ్ చేయాలని పోలీసులు కోరారు.

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్…
టివోలీ జంక్షన్ నుంచి బ్రూక్ బాండ్, ఎన్‌సిసి జంక్షన్, టివోలీ మీదుగా ప్లాజా వరకు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News