Sunday, January 5, 2025

రేపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

దేశ ఉపరాష్ట్రపతి జగదీప్ ధనకర్ శుక్రవారం హైదరాబాద్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రానున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ అదనపు పోలీస్ కమిషనర్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని కోరారు. ఉపరాష్ట్రపతి మధ్యాహ్నం 3 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు ప్రత్యేక విమానంలో రానున్నారు, అక్కడి నుంచి జినోమ్ వ్యాలీలో నిర్వహించనున్న కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఉపరాష్ట్రపతి పర్యటించనున్న మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

తుర్కపల్లి వయా పిఎన్‌టి ఫ్లైఓవర్, సికింద్రాబాద్ క్లబ్ గేట్, కార్ఖాన, తిరుమలగిరి క్రాస్ రోడ్డు, లోతుకుంట, తెలంగాణ తల్లి విగ్రహం, అల్వాల్, అయ్యప్ప స్వామి టెంపుల్, బొల్లారం చెక్‌పోస్టు, హకింపేట వై జంక్షన్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కార్యక్రమం ముగించుకుని తిరిగి ఉపరాష్ట్రపతి ఇదే రూట్‌లో సోమాజిగూడలోని రాజ్‌భవన్‌కు తిరిగి రానున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బేగంపేట ఫ్లైఓవర్, గ్రీన్స్‌ల్యాండ్, ఐటిసి కాకతీయ, రాజీవ్‌గాంధీ స్టాట్యూ, యశోద ఆస్పత్రి, ఎంఎంటిఎస్, రాజ్‌భవ వరకు ఆంక్షలు విధించారు.

రాజ్‌భవన్ నుంచి రాత్రి 7.10 గంటలకు రాజ్‌భవన్ నుంచి బయలుదేరి హైటెక్స్‌లో జరగనున్న కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సమయంలో వివి స్టాట్యూ, ఈనాడు కార్యాలయం, ఓల్డ్ కెసిపి, అన్సారీ మంజిల్, తాజ్‌కృష్ణ జంక్షన్, రోడ్ నంబర్ 1 లేదా 7, రోడ్డు నంబర్ 1, ఎన్‌ఎఫ్‌సిఎల్ జంక్షన్, ఎస్‌ఎన్‌టి జంక్షన్, సాగర్ సొసైటీ, ఎన్‌టిఆర్ భవన్ జంక్షన్, జూబ్లీహిల్స్ చెక్ పోస్టు, రోడ్డు నంబర్ 45, రోడ్డు నంబర్ 45 ఫ్లైఓవర్, కేబుల్ బ్రిడ్జి నుంచి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి ఎంటర్ అవుతారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత ఉపరాష్ట్రపతి బేగంపేట ఎయిర్ పోర్టుకు కేబుల్ బ్రిడ్జి, రోడ్డునంబర్ 45 జంక్షన్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, ఎన్‌టిఆర్ భవన్, సాగర్ సొసైటీ, ఎస్‌ఎన్‌టి జంక్షన్, ఎన్‌ఎఫ్‌సిఎల్ జంక్షన్, పంజాగుట్ట ఫ్లైఓవర్, ప్రజాభవన్, శ్యామ్‌లాల్ బిల్డింగ్, అండర్ పిఎన్‌టి ఫ్లైఓవర్ లెఫ్ట్ టర్న్ తీసుకుని బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News