Saturday, November 16, 2024

నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -
Traffic restrictions in hyderabad
ఎల్‌బి స్టేడియంలో సిఎం కెసిఆర్ క్రిస్మస్ విందు

హైదరాబాద్: ఎల్‌బి స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర అదనపు పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ విజయ్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ క్రిస్మస్ విందు సందర్భంగా ఎల్‌బి స్టేడియం పరిసరాల్లో మంగళవారం ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎల్బి నగర్ వైపునకు వెళ్లే ట్రాఫిక్‌పై ఆంక్షలు విధించారు.

బిజేఆర్ విగ్రహం వైపు వాహనాలను అనుమతించరు, వాటిని నాంపల్లి, చాపెల్ రోడ్డు వైపు మళ్లిస్తారు. అబిడ్స్ రోడ్డు నుంచి బిజేఆర్ విగ్రహం వైపు ట్రాఫిక్‌ను అనుమతించరు. అటు నుంచి వచ్చే వాహనాలను ఎస్‌బిఐ గన్‌ఫౌండ్రి వద్ద చాపెల్ రోడ్డు వైపు మళ్లించనున్నారు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ట్రాఫిక్ బషీర్‌బాగ్ జంక్షన్ వద్ద లిబర్టీ వైపు మళ్లించనున్నారు.

పార్కింగ్…

గోల్డ్ కార్డు పాసులు కలిగిన అతిథులు ఏ గేట్ వద్ద కెఎల్‌కే( ఖాన్ లతీఫ్ ఖాన్) భవనం ఎదురుగా దిగి, లోపలి గేట్ నంబర్ 17 ద్వారా ప్రవేశించి, అలియా మోడల్ స్కూల్, ఎస్‌సిఈఆర్‌టి, అలియా కాలేజీలో వాహనాలను పార్కింగ్ చేయాలి. గ్రీన్ కార్డు పాస్‌లు ఉన్న వారు డీ గేట్ వద్ద దిగాలి. అలియా మోడల్ స్కూల్, బిజేఆర్ విగ్రహం దగ్గర, ఎస్‌ఎటిఎస్ గేట్ ద్వారా ప్రవేశించి వారి వాహనాలను అలియా కళాశాల, మహబూబ్ కళాశాల, అలియా మోడల్ స్కూల్, ఎస్‌సిఈఆర్‌టి వద్ద పార్క్ చేయాలి. బ్లూ కార్డు పాసులు ఉన్న వారు అయకార్ భవన్ ఎదురుగా ఉన్న జి గేట్ వద్ద దిగి, లోపలి గేట్ నంబర్ 15 ద్వారా ప్రవేశించి. పబ్లిక్ గార్డెన్‌లో తమ వాహనాలను పార్కింగ్ చేయాలి. పింక్ కార్డు పాస్‌లు ఉన్న వారు బిజేఆర్ విగ్రహం సమీపంలోని ఎఫ్, ఎఫ్1 గేట్ల వద్ద దిగి లోపలి గేట్ నంబర్ 6,8 ద్వారా ప్రవేశించి, నిజాం కళాశాల మైదానంలో వాహనాలను పార్కింగ్ చేయాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News