హైదరాబాద్: భారత వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు పర్యటన నేపథ్యంలో శనివారం ఉదయం ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రామంతపూర్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో జరగనున్న కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 9 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. జూబ్లీహిల్స్, రోడ్డు నంబర్ 29లోని ఇంటి నుంచి బయలుదేరి పెద్దమ్మ టెంపుల్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, ఎన్‌టిఆర్ భవన్, సాగర్ సొసైటీ, శ్రీనగర్ టీ జంక్షన్, ఎన్‌ఎఫ్‌సిఎల్, పంజాగుట్ట ఫ్లైఓవర్, సిఎం క్యాంప్ ఆఫీస్, గ్రీన్‌ల్యాండ్స్ ఫ్లైఓవర్, బేగంపేట ఫ్లైఓవర్, పిఎన్‌టి ఫ్లైఓవఱ్, రసూల్‌ఫుర జంక్షన్, సిటిఓ ఓవర్ ప్లాజా, వైఎంసిఏ ఫ్లైఓవర్, సెయింట్ జాన్ రోటరీ, సంగీత్ ఎక్స్ రోడ్డు, రైల్ నిలయం, మెట్టుగూడ, తార్నాక ఫ్లైఓవర్, హబ్సీగూడ, ఎన్‌జిఆర్‌ఐ నుంచి రామంత పూర్ వెళ్లనున్నారు. ఉపరాష్ట్రపతి పర్యటించే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు పేర్కొన్నారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని కోరారు.
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -