రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ కమిషనర్లు సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 17వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని కోరారు.ఈ నెల 17వ తేదీన హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వై జంక్షన్, బొల్లారం చెక్‌పోస్టు, నావీ హౌస్ జంక్షన్, యాప్రాల్ రోడ్డు, హెలీపాడ్ వై జంక్షన్, బైసన్ ఎక్స్ రోడ్డు, అమ్ముగూడ జంక్షన్, లోతుకుంట టి జంక్షన్, లాల్ బజార్, హోలీ ఫ్యామిలీ జంక్షన్, తిరుమలగిరి ఎక్స్ రోడ్డు, హనుమాన్ టెంపుల్, కార్ఖాన, ఎయిర్‌టెల్ షోరూం, ఎన్‌సిసి, టివోలి, ప్లాజా, సిటిఓ, రసూల్‌పుర, పిఎన్‌టి, హెచ్‌పిఎస్, బేగంపేట ఫ్లైఓవర్, గ్రీన్ ల్యాండ్స్, పంజాగుట్ట జంక్షన్, మోనప్ప జంక్షన్, యశోద ఆస్పత్రి, కత్రీయ హోటల్, రాజ్‌భవన్, మెట్రో రెసిడెన్సీ, వివి స్టాట్యూ ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు.
ఇదే ప్రాంతాల్లో 21వ తేదీన ఆంక్షలు ఉంటాయి.
20వ తేదీన బైసన్ ఎక్స్‌రోడ్డు, అమ్ముగూడ జంక్షన్, లోతుకుంట టి జంక్షన్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
20వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు లోతుకుంట జంక్షన్, లాల్ బజార్, హోలీ ఫ్యామిలీ జంక్షన్, తిరుమలగిరి ఎక్స్ రోడ్డు, హనుమాన్ టెంపుల్, కార్ఖాన, ఎయిర్‌టెల్ షైఓరూం, ఎన్‌సిసి, టివోలి, ప్లాజా, సిటిఓ, రసూల్‌పుర, పిఎన్‌టి, హెచ్‌పిసి, బేగంపేట ఫ్లైఓవర్, గ్రీన్స్‌ల్యాండ్, పంజాగుట్ట జంక్షన్, మోనప్ప జంక్షన్, యశోద ఆస్పత్రి, కత్రీయ హోటల్, రాజ్‌భవన్, మెట్రో రెసిడెన్సీ, వివి స్టాట్యూ.
సైబరాబాద్‌లో…
రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మంగళవారం సాయంత్రం 4.30 గంటల నుంచి 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బిటిఎస్ జంక్షన్ నుంచి వెళ్లే తూంకుంట, హకీంపేట వద్ద ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.