Tuesday, January 21, 2025

SRH vs MI మ్యాచ్.. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఐపిఎల్‌లో భాగంగా బుధవారం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఢీకొనబోతోంది. ఈ రోజు సాయంత్రం 7.30 గంటలకు మ్యాచ్‌ జరగనుంది. ఈ క్రమంలో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. నగరంలో సాయంత్రం 4 నుంచి రాత్రి 11.30 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు ఉండనున్నాయని సీపీ తరుణ్ జోషి వెల్లడించారు.

బోడుప్పల్‌, చెంగిచెర్ల, పీర్జాదిగూడ నుంచి వచ్చే వాహనాలను హెచ్‌ఎండీఏ భగాయత్‌ లే అవుట్‌ ద్వారా నాగోల్‌ వైపు మళ్లిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇక, నాగోల్‌ నుంచి వచ్చే వాహనాలు మెట్రోస్టేషన్‌ నుంచి యూ టర్న్‌ తీసుకొని, భగాయత్‌ లేఅవుట్‌ నుంచి వెళ్లాలని సూచించారు. తార్నాక నుంచి వచ్చే వెహికిల్స్ హబ్సిగూడ చౌరస్తా నుంచి నాచారం వైపు మళ్లించనున్నట్ల చెప్పారు. ట్రాఫిక్‌ ఆంక్షలను దృష్టిలో పెట్టుకొని వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సీపీ చెప్పారు.

కాగా, హైదరాబాద్, ముంబై రెండు జట్లు కూడా తమ తమ తొలి మ్యాచుల్లో ఓటమి పాలయ్యాయి. అయితే ఈ మ్యాచ్‌లో గెలిచి బోణీ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాయి. సొంత గడ్డపై ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న హైదరాబాద్ ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News