ఫ్లైఓవర్లు మూసివేత
ఆదేశాలు జారీ చేసిన సిపి సివి ఆనంద్
మనతెలంగాణ, హైదరాబాద్ : మిలాద్ ఉన్ నబీ ర్యాలీ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ సిపి సివి ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 9వ తేదీ ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. నగరంలోని అన్ని ఫ్లైఓవర్లను మూసివేయనున్నారు. బేగంపేట, లంగర్‌హౌస్,దబీర్‌పుర, లాలాపేట, పివిఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేను మాత్రం ఓపెన్ చేసి ఉంచనున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని కోరారు. ర్యాలీ సయిద్ ఖాద్రీ చమన్ నుంచి ప్రారంభమై గులాం మూర్తజా కాలనీ, ఫలక్‌నూమ నుంచి ఫలక్‌నూమ ఎక్స్ రోడ్స్, ఆలియాబాద్ ఎక్స్ రోడ్డు, లాల్‌దర్వాజా ఎక్స్ రోడ్డు, చార్మినార్, గుల్జార్‌హౌస్, మైదాన్, నయాపూల్ బ్రిడ్జి, సలార్‌జంగ్ ముజియం,సాలార్ జంగ్ రోటరీ, పురాణాహవేలి, ఈటేబార్ చైక్, బిబి బజార్‌లోని వోల్టా హోటల్ వద్ద ముగుస్తుందని పేర్కొన్నారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని కోరారు.