Monday, December 23, 2024

బోనాల సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః జంట నగరాల్లో జరగనున్న బోనాల సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు నగరంలోని మంహకాళీ టెంపుల్ అంబర్‌పేటలో 16వ తేదీ ఉదయం 6గంటల నుంచి 18వ తేదీ వరకు అమలులో ఉండగా, పాతబస్తీలో 16వ తేదీ నుంచి 17 తేదీల్లో అమలులో ఉండనున్నాయి. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని కోరారు.
ఉప్పల్ నుంచి వచ్చే జిల్లాల బస్సులు,సిటీ బస్సులు, భారీ వాహనాలను ఉప్పల్ ఎక్స్ రోడ్డు నుంచి హబ్సీగూడ, తార్నాక, అడిక్‌మెట్, విద్యానగర్, ఫీవర్ ఆస్పత్రి, టివై మండి, టూరిస్ట్ హోటల్ జంక్షన్, నింబోలి అడ్డా, చాదర్‌ఘాట్, సిబిఎస్‌కు రావాలి, తిరిగి అదే రూట్‌లో వెళ్లాలి.
కోటి నుంచి ఉప్పల్ వైపు వెళ్లే భారీ వాహనాలు, బస్సులు నింబోలిఅడ్డా, టూరిస్ట్‌హోటల్, టివై మండలి, ఫీవర్ ఆస్పత్రి, అడిక్‌మెట్, తార్నాక, హబ్సీగూడ, ఉప్పల్ ఎక్స్ రోడ్డు నుంచి వెళ్లాలి.
ఉప్పల్ నుంచి అంబర్‌పేట వైపు వచ్చే సాధారణ వాహనాలను రాయల్ జ్యూకార్నర్ వద్ద డైవర్ట్ చేసి మల్లికార్జుననగర్, డిడి కాలనీ, సిండికేట్ బ్యాంక్, శివం రోడ్డు వైపు మళ్లిస్తారు. గోల్నాక, ముసారాంబాగ్ వైపు వెళ్లే వాహనాలను సిపిఎల్ అంబర్‌పేట, సల్‌ధానాగేట్, అలీకేఫ్ ఎక్స్ రోడ్డు వైపు మళ్లిస్తారు.
పాతబస్తీలో…
పాతబస్తీలో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాపిక్ ఆంక్షలు విధించారు.
ఇంజన్‌బౌలి,ఫలక్‌నూమా నుంచి వచ్చే వాహనాలను ఆలియాబాద్, నుంచి న్యూ శంషీర్‌గంజ్ టి జంక్షన్ మీదుగా, గోషాల, తాడ్‌బన్ లేదా గోషాల మిస్త్రీ గంజ్,కిలావత్ వైపు మళ్లిస్తారు.
ఎంబిఎన్‌ఆర్ ఎక్స్ రోడ్డు నుంచి వచ్చే వాహనాలను ఆలియాబాద్ వైపు అనుమతించరు, వాటిని ఇంజిన్‌బౌలి మీదుగా జహానుమా, గోషాలా, తాడ్‌బన్ వైపు మళ్లిస్తారు.
నాగులచింత, సుధాటాకీస్ నుంచి వచ్చే వాహనాలను లాల్‌దర్వాజా టెంపుల్ అనుమతించరు. నెహ్రూ మోడ్ మీదుగా సుధా టాకీస్ వయా గౌలిపుర వైపు మళ్లిస్తారు.
గౌలిపుర నుంచి లాల్ దర్వాజా వైపు వెళ్లే వాహనాలను సుధా టాకీస్ మీదుగా మీర్‌చౌక్ వయా హరిబౌలి వైపు మళ్లిస్తారు.
పంచమోహళ్లా నుంచి వచ్చే వాహనాలను నాగులచింత వైపు అనుమతించరు, హరిబౌలి, వోల్గా ఆస్పత్రి, మిస్త్రీ గంజ్ వైపు మళ్లిస్తారు.
రాజన్న బౌలి నుంచి లాల్ దర్వాజ టెంపుల్ వైపు వచ్చే వాహనాలను వెంకటేశ్వర స్వామి టెంపుల్‌లేన్ మీదుగా రామస్వామిగంజ్ వైపు మళ్లిస్తారు.
కందికల్‌గేట్ నుంచి వచ్చే వాహనాలను లాల్ దర్వాజా వైపు అనుమతించరు. ఓల్డ్ ఛత్రినాఖ పిఎస్, వై జంక్షన్ మీదుగా గౌలిపుర వైపు మళ్లిస్తారు.
బాలాగుంజ్ వైపు వచ్చే వాహనాలను లాల్ దర్వాజా టెంపుల్ వైపు అనుమతించకుండా లక్ష్మిదేవి పాన్‌షాపు మీదుగా నేహ్రూ స్టాట్యూ నుంచి నాగులచింత జంక్షన్ వైపు మళ్లిస్తారు.
ఉప్పుగూడ, ఛత్రినాఖ వైపు నుంచి వయా గౌలిపుర నుంచి వచ్చే వాహనాలను మహ్మద్ షుకూర్ మసీద్ వైపు అనుమతించరు. బాలరాజ్ జూవెల్లర్స్ పాయిట్, గౌలిపుర ఎక్స్ రోడ్డు మీదుగా మొఘల్ పురా పోలీస్ స్టేషన్ వైపు మళ్లిస్తారు.
కందికల్ గేట్ ఫ్లైఓవర్ నుంచి ఛత్రినాఖ ఓపి వైపు వచ్చే వాహనాలను విఎన్ రెడ్డి నగర్ కమాన్, ఉప్పుగూడ జండా వైపు మళ్లిస్తారు.
ఓల్డ్ చాంద్రాయణగుట్ట నుంచి ఛత్రినాఖ వైపు వచ్చే భారీ వాహనాలను అనుమతించరు, సంతోష్ నగర్, చాంద్రాయణగుట్ట వైపు మళ్లిస్తారు.
ఫతేదర్వాజా నుంచి వచ్చే వాహనాలను హిమ్మత్‌పుర ఎక్స్ రోడ్డు లేదా రాజేష్ మెడికల్ హాల్ వైపు అనుమతించరు. వోల్గా హోటల్ టి జంక్షన్ మీదుగా కిలావత్ రోడ్డు వైపు మళ్లిస్తారు.
గౌలిపుర నుంచి వచ్చే వాహనాలను సుధా థియేటర్ వైపు అనుతించరు. మహ్మద్ షుకూర్ మజీద్ మీదుగా మీర్‌చౌక్ వయా వోల్టా హోటల్, మొఘల్‌పుర, ఈతాబార్ చౌక్ వైపు మళ్లిస్తారు.
ఛత్రినాఖ ఓపి నుంచి గౌలిపుర వైపు వచ్చే వాహనాలను గాంధీ విగ్రహం మీదుగా శ్రీరాం నగర్ కాలనీ, సిబిఐ క్వార్టర్స్, సుల్తాన్ షాహి, లలితాబాగ్, మొఘల్‌పుర వైపు మళ్లిస్తారు.
ఫతేదర్వాజా నుంచి హిమ్మత్‌పుర రోడ్డు వైపు వచ్చే వాహనాలు హిమ్మత్‌పుర మెయిన్ రోడ్డు, నాగులచింత వైపు నుంచి వోల్గా హోటల్ వయా క్వాజీపుర వైపు మళ్లిస్తారు.
మీర్ కా డియారా, మొఘల్‌పుర వైపు వచ్చే వాహనాలను హరి బౌలి ఎక్స్ రోడ్డు నుంచి మొఘల్‌పుర వాటర్ ట్యాంక్ వైపు మళ్లిస్తారు.
చార్మినార్ మెయిన్ రోడ్డు నుంచి ఆసరా ఆస్పత్రి సైడ్ మొఘల్‌పుర వాటర్ ట్యాంక్ వైపు అనుమతించరు. బిబి బజార్ వైపు మళ్లిస్తారు.
భవానీ నగర్, మిర్జుమాలా తలాబ్ నుంచి వచ్చే వాహనాలను చార్మినార్ వైపు అనుమతించరు. బిబి బజార్ ఎక్స్ రోడ్డు మీదుగా ఆలిజా కోట్లా వైపు మళ్లిస్తారు.
ఆలిజాకోట్లా లేదా మొఘల్‌పుర నుంచి చార్మినార్ వయా సర్దార్ మహల్ రోడ్డు వైపు వచ్చే వాహనాలను చౌక్ మైదాన్ ఖాన్ మీదుగా హఫీజ్ డంకా మజీద్, అర్మాన్ హోటల్ వయా శ్రీగాయత్రి కాలేజీ వైపు మళ్లిస్తారు.
యాకత్‌పుర నుంచి వచ్చే వాహనాలను గుల్జార్ హౌస్ అనుమతించరు, ఈటాబార్ చౌక్ మీదుగా మీర్‌ఆలంమండి, ఆలిజా కోట్లా రోడ్డు వైపు మళ్లిస్తారు.
పురాణి హవేలి నుంచి వచ్చే వాహనాలను టిప్పు ఖానా మసీద వైపు అనుమతించరు, చట్టా బజార్ నుంచి లక్కడి కోటే ఎక్స్‌రోడ్డు మీదుగా అపాట్ జంక్షన్ లేదా దారు ఉల్ శిషా వైపు అనుమతిస్తారు.
చాదర్‌ఘాట్, నూర్‌ఖాన్ బజార్, ఎస్‌జె రోటరీ, శివాజీ బ్రిడ్జి నుంచి వచ్చే వాహనాలను సాలార్‌జంగ్ మ్యూజియం రోడ్డు వైపు అనుమతించరు. ఎస్‌జే రోటరీ మీదుగా పురాణా హవేలి రోడ్డు, శివాజీ బ్రిడ్జి , చాదర్‌ఘాట్ వైపు అనుమతిస్తారు.
ఖిలావత్ రోడ్డు లేదా మూసాబౌలి రోడ్డు నుంచి వచ్చే వాహనాలను లాడ్ బజార్ వైపు అనుమతించరు. మోటీగల్లీ టి జంక్షన్ మీదుగా ఖిలావత్ ప్లే గ్రౌండ్ లేదా మూసా బౌలి వైపు అనుమతిస్తారు.
బండి కే అడ్డా, ఘన్సీ బజార్ నుంచి వచ్చే వాహనాలను గుల్జార్ హౌస్ వైపు అనుమతించరు. మిట్టీ కు షేర్ మీదుగా ఘన్సీ బజార్, చెల్‌పుర వైపు మళ్లిస్తారు.
పురాణాపూల్, గుడ్‌విల్ హోటల్, మూసాబౌలి నుంచి వచ్చే వాహనాలను నయాపూల్ వయా హైకోర్టు గేట్ నంబర్ 1,మూసీ రివర్ అనుమతించరు. ముస్లీం జంగ్ బ్రిడ్జి మీదుగా భూలక్ష్మి టెంపుల్, బేగం బజార్, చత్రి వైపు మళ్లిస్తారు.
గౌలిగూడ, సిద్దంబజార్ మీదుగా నయాపూల్ వెళ్లే వాహనాలను అఫ్జల్‌గంజ్ మీదుగా ముస్లీం జంగ్ బ్రిడ్జి వయా ఉస్మానియా ఆస్పత్రి వెనుక నుంచి ముసీ రివర్ లేదా శివాజీ బ్రిడ్జి వైపు మళ్లిస్తారు.
మదీనా ఎక్స్ రోడ్డు నుంచి ఇంజిన్ బౌలి వయా గుల్జార్ హౌస్, చార్మినార్ మోనుమెంట్, చార్మినార్ బస్ టెర్మినల్, హిమ్మత్‌పుర, నాగులచింత, ఆలియాబాద్ వైపు వాహనాలను అనుమతించరు.
ఆర్టిసి బస్సులు….
సిటి ఆర్టిసి బస్సులను చార్మినార్, ఫలక్‌నూమా, నయాపూల్ వైపు అనుమతించరు. ఓల్‌డ సిబిఎస్, అఫ్జల్‌గంజ్, దారుల్‌సిఫ్ ఎక్స్ రోడ్డు, ఛత్రినాఖ, ఇంజిని బౌలి వద్ద నుంచి ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News