Sunday, September 29, 2024

ఈ నెల 12న నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః ప్రత్యేక రాష్ట్రం ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ పోలీసులు ఈ నెల 12వ తేదీన తెలంగాణ రన్ నిర్వహించనున్నారు. పాల్గొనే వారు, విఐపిలు పాల్గొనే అవకాశం ఉంది. దీంతో ఆ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని వాహనదారులు ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని కోరారు.
వివి స్టాట్యూ, నెక్లెస్‌రోటరీ, ఎన్‌టిఆర్ మార్గ్, తెలుగు తల్లి జంక్షన్ మధ్య వాహనాలను అనుమతించరు.
ఖైరతాబాద్, పంజాగుట్ట, సోమాజిగూడ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలను వివి స్టాట్యూ మీదుగా ఐఎస్ సదన్, నిరంకారి వైపు మళ్లిస్తారు.
నిరంకారి,చింతల్‌బస్తీ నుంచి నెక్లెస్ రోటరీ మీదుగా వెళ్లే వాహనాలను ఖైరతాబాద్ ఫ్లైఓవర్ నుంచి అనుమతించరు.
ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి ట్యాంక్‌బండ్, రాణిగంజ్, లిబర్టీ వైపు వెళ్లే వాహనాలను తెలుగుతల్లి జంక్షన్, అంబేద్కర్ స్టాట్యూ, ట్యాంక్‌బండ్‌వైపు అనుమతించరు. తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా కట్టమైసమ్మ జంక్షన్, లోయర్ ట్యాంక్‌బండ్‌వైపు వెళ్లాలి.
ట్యాంక్‌బండ్, తెలుగుతల్లి నుంచి ఎన్‌టిఆర్ బార్గ్ వెళ్లే వాహనాలను అనుమతించరు, వాహనాలను తెలుగుతల్లి జంక్షన్ మీదుగా ఇక్బాల్ మినార్ జంక్షన్ వైపు మళ్లిస్తారు.
బిఆర్‌కెఆర్ భవన్ నుంచి ఎన్‌టిఆర్ మార్గ్ వెళ్లే వాహనాలను అనుమతించరు. తెలుగుతల్లి జంక్షన్ మీదుగా ఇక్బాల్ మినార్ జంక్షన్ వైపు మళ్లిస్తారు.
బడాగణేష్ లేన్ నుంచి ఐమ్యాక్స్, నెక్లెస్‌రోటరీ వైపు వచ్చే వాహనాలను బడాగణేష్ మీదుగా రాజ్‌దూత్ లేన్ వైపు వెళ్లాలి.
బుద్దభవన్, నల్లగుట్ట జంక్షన్ మీదుగా నెక్లెస్‌రోటరీ వెపు వచ్చే వాహనాలను నల్లగుట్ట మీదుగా బుద్దభవన్, రాణిగంజ్ వైపు మళ్లిస్తారు.

ఆర్టిసి బస్సులు…
అఫ్జల్‌గంజ్ మీదుగా సికింద్రాబాద్ వెళ్లే ఆర్‌టిసి బస్సులు ట్యాంక్‌బండ్ రోడ్డు కాకుండా తెలుగుతల్లి ఫ్లైఓవర్, కట్టమైసమ్మ, లోయర్ ట్యాంక్‌బండ్, డిబిఆర్ మిల్స్, కవాడిగూడవైపు వెళ్లాలి.
ట్రాఫిక్ ఉండే జంక్షన్లు…
వివి స్టాట్యూ జంక్షన్, ఓల్డ్ సైఫాబాద్ పిఎస్ జంక్షన్, రవీంద్రభారతి జంక్షన్, మింట్ కాంపౌండ్ రోడ్డు, తెలుగుతల్లి జంక్షన్, నెక్లెస్‌రోటరీ, నల్లగుట్ట జంక్షన్, కట్టమైసమ్మ, ట్యాంక్‌బండ్, లిబర్టీ ఈ జంక్షన్లలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది, వాహనదారులు ఈ జంక్షన్‌ను అవాయిడ్ చేయాలని పోలీసులు కోరారు.
పార్కింగ్ ప్రాంతాలు…
కార్యక్రమానికి వచ్చే వారు వాహనాలను పోలీసులు కేటాయించిన ప్రాంతంలో నిలపాలి.
విఐపిలు ఐమ్యాక్స్ థియేటర్ వెనుక పార్కింగ్ చేయాలి. ఉద్యోగులు బిఆర్ అంబేద్కర్ స్టాట్యూ పక్కన నిలపాలి. బస్సులు, మిగతా వాహనాలు ఐమ్యాక్స్ నెక్లెస్ రోడ్డు సింగిల్ లేన్‌లో పార్కింగ్ చేయాలి. ఎన్‌టిర్ ఘాట్‌లో 80 కార్లు పార్కింగ్ చేయాలి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News