Sunday, December 22, 2024

నేడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంట వరకు పబ్లిక్ గార్డెన్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ అదనపు పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ ఆదేశాలు జారీ చేశారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని కోరారు.

– ఎంజే మార్కెట్ నుంచి మెహిదీపట్నం వైపు వచ్చే వాహనాలను టాజ్ ఐస్ ల్యాండ్ మీదుగా తాజ్ ఐస్‌ల్యాండ్ మీదుగా ఎక్ మినార్, బజార్‌ఘాట్, ఆసిఫ్‌నగర్, రెడ్‌హిల్స్, అయోధ్య హోటల్, లకిడికాపూల్ వైపు మళ్లించారు.
– నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి పబ్లిక్ గార్డెన్ మీదుగా వచ్చే వాహనాలను చాపెల్ రోడ్డు టీ జంక్షన్ మీదుగా గన్‌ఫ్రౌండీ, బిజెఆర్ స్టాట్యూ, బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ మీదుగా మళ్లిస్తారు.
నిరంకారి భవన్, ఖైరతాబాద్ మీదుగా రవీంద్రభారతి వైపు వచ్చే వాహనాలను ఓల్ సైఫాబాద్ పోలీస్ స్టేషన్ మీదుగా టెలిఫోన్‌భవన్, ఇక్బాల్ మినార్, సెక్రటేరియట్ రోడ్డు, తెలుగుతల్లి, అంబేద్కర్ స్టాట్యూ, లిబర్టీ, బషీర్‌బాగ్, అబిడ్స్‌వైపు మళ్లిస్తారు.
– హైదర్‌గూడ, కింగ్ కోఠి, బిజేఆర్ స్టాట్యూ నుంచి హెచ్‌టిపి జంక్షన్, పబ్లిక్ గార్డెన్ వైపు వచ్చే వాహనాలను బషీర్‌బాగ్ జంక్షన్ మీదుగా లిబర్టీ, తెలుగుతల్లి, ఎన్‌టిఆర్ మార్గ్, ఇక్బాల్ మినార్, ఓల్డ్ పిఎస్ సైఫాబాద్, లకిడాపూల్ బ్రిడ్జి, బిజెఆర్ స్టాట్యూ, అబిడ్స్ వైపు మళ్లిస్తారు.

– ట్యాంక్‌బండ్ నుంచి రవీంద్రభారతి వైపు వచ్చే వాహనాలను ఇక్బాల్ మినార్ మీదుగా టెలీఫోన్ భవన్ రోడ్డు, ఓల్డ్ సైఫాబాద్ పిఎస్, లకిడికాపూల్ బ్రిడ్జి వైపు మళ్లిస్తారు.
నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి పబ్లిక్ గార్డెన్ వైపు వచ్చే వాహనాలను -ఎఆర్ పెట్రోల్ పంప్ మీదుగా బిజెఆర్ స్టాట్యూ వైపు మళ్లిస్తారు.
– తెలుగుతల్లి, ఎన్‌టిఆర్ మార్గ్, లిబర్టీ నుంచి హెచ్‌టిసి జంక్షన్ మీదుగా ఆదర్శనగర్ వైపు వెళ్లే వాహనాలను ప్యాలెస్ కాలనీ రోడ్డు వద్ద డైవర్ట్ చేసి లిబర్టీ రోడ్డు వైపు మళ్లిస్తారు.
వార్ మెమోరియల్‌లో సిఎం నివాళి…
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్, పరేడ్ గ్రౌండ్‌లోని వార్ మెమోరియల్‌లో నివాళి అర్పించున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 6.30 నుంచి 7.30 గంటల వరకు రసూల్‌పుర, సిటిఓ, ప్లాజా,టివోలీ,ఎస్‌బిఐ జంక్షన్లలో ట్రాఫిక్ నిలిపివేయనున్నారు.

రాజ్‌భవన్‌లో ఎట్ హోం….
రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై రాజ్‌భవన్‌లో శుక్రవారం ఎట్‌హోం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రాజ్‌భవన్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాజీవ్ గాంధీ స్టాట్యూ, సోమాజిగూడ నుంచి ఖైరతాబాద్ జంక్షన్, రాజ్‌భవన్ రోడ్డు పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశం ఉంది. వాహనదారులు సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని పోలీసులు కోరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి, డిప్యూటీ సిఎం, తెలంగాణ ఛీఫ్ జస్టిస్,తెలంగాణ లెజిస్టేటీవ్ అసెంబ్లీ స్పీకర్, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు గేట్ నంబర్ 1 నుంచి ఎంటర్ అయి, గేట్ 2 నుంచి వెళ్లిపోవాలి. వారికి కేటాయించిన పార్కింగ్‌లో వాహనాలను పార్కింగ్ చేయాలి.
బ్లూ, రెడ్ కార్ పాస్ ఉన్న వారు గేట్ నంబర్3 నుంచి వెళ్లి రాజ్‌భవన్ బయట ఉన్న పార్కింగ్ ప్లేస్‌లో వాహనాలను నిలిపివేయాలి.
పార్కింగ్ ప్రాంతాలు…
రాజ్‌భవన్ క్వార్టర్స్, సంస్కృతి కమ్యూనిటీ హాల్, ప్రభుత్వ పాఠశాల రాజ్‌భవన్, ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ, పోస్ట్ ఆఫీస్, దిల్‌కుషా ప్రభుత్వ గెస్ట్ హౌస్, జివికె స్కై సిటీ అపార్ట్‌మెంట్సలో రెడ్ పాస్ ఉన్న వారు, ఎంఎంటిఎస్, ఎంటిఓ పార్కింగ్‌లో వాహనాలను పార్కింగ్ చేయాలి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News