- Advertisement -
హైదరాబాద్ : భారత ఉపరాష్ట్రపతి నగరంలో పర్యటించనున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ జాయింట్ సిపి ఎవి రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గురువారం సాయంత్రం 6.40 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో రానున్నారు. బేగంపేట నుంచి జూబ్లీహిల్స్, రోడ్డు నంబర్ 29లోని తన నివాసానికి చేరుకుంటారు. పిఎన్టి ఫ్లైఓవర్, శ్యామ్‌లాల్ బిల్డింగ్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బేగంపేట ఫ్లైఓవర్, పంజాగుట్ట ఫ్లైఓవర్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, రోడ్డునంబర్ 29 ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పేర్కొన్నారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని కోరారు.
- Advertisement -