ఆదేశాలు జారీ చేసిన ట్రాఫిక్ జాయింట్ సిపి రంగనాథ్
హైదరాబాద్ : బాబు జగ్జివన్‌రామ్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం నగరంలో ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తూ హైదరాబాద్ జాయింట్ పోలీస్ కమిషనర్ ఎవి రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు. లాల్ బహదూర్ స్టేడియం సమీపంలోని బిజేఆర్ విగ్రహం వద్ద వేడుకలు నిర్వహించనున్నారు. ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు. ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని వాహనదారులు ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని కోరారు.
చాపెల్ రోడ్డు, నాంపల్లి నుంచి బిజేఆర్ స్టాట్యూ వైపునకు వాహనాలను అనుమతించరు, ఎఆర్ పెట్రోల్ పంపు మీదుగా పిసిఆర్ వైపు మళ్లిస్తారు.
ఎస్‌బిఐ గన్‌ఫౌండ్రీ నుంచి ప్రెస్‌క్లబ్, బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ వైపు వాహనాలను అనుమతించరు, చాపెల్ రోడ్డు మీదుగా గన్‌ఫౌండ్రీ వైపు మళ్లిస్తారు. రవీంద్రభారతీ, హిల్ ఫోర్టు రోడ్డు మీదుగా బిజేఆర్ స్టాట్యూ వచ్చే వాహనాలను సుజాతా హైస్కూల్, ఫతేమైదాన్ వైపు మళ్లిస్తారు. బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ నుంచి వచ్చే వాహనాలు బిజేఆర్ స్టాట్యూ వద్ద రైటర్న్ తీసుకుని ఎస్‌బిఐ గన్‌పౌండ్రీ నుంచి రైటర్న్ తీసుకుని వెళ్లాలి.