Tuesday, December 17, 2024

నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

 

Traffic restrictions in Hyderabad tomorrow

హైదరాబాద్ : నగరంలో ఉపరాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఆదివారం ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ జాయింట్ పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ ఎవి రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలకు అనుగుణంగా ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని సూచించారు. ఉపరాష్ట్రపతి తన నివాసం నుంచి బోయిన్‌పల్లిలోని ఎన్‌ఐఈపిఐడికి వెళ్లేందుకు నుంచి మద్యాహ్నం 3.30 గంటలకు బయలుదేరి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, ఎన్టీర్ భవన్, సాగర్ సొసైటీ, శ్రీనగర్ టీ జంక్షన్, ఎన్‌ఎఫ్‌సిఎల్, పంజాగుట్ట ఫ్లైఓవర్, మోనప్ప జంక్షన్, సిఎం క్యాంప్ ఆఫీస్, గ్రీన్‌ల్యాండ్స్ ఫ్లైఓవర్, బేగంపేట ఫ్లైఓవర్, పిఎన్‌టి ఫ్లైఓవర్, రసూల్‌పుర జంక్షన్, సిటిఓ ఫ్లైవర్, ప్లాజా జంక్షన్, లెఫ్ట్ టర్న్ కార్ఖానా హనుమాన్ టెంపుల్ బోయిన్‌పల్లి మార్కెట్ యార్డ్, ఎన్‌ఐఈపిఐడి బోయిన్‌పల్లి వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. కార్యక్రమం ముగిసన తర్వాత ఉపరాష్ట్రపతి బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News