హైదరాబాద్: ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారోత్సవ వేదికైన ఎల్‌బి స్డేడియంలో పోలీసులు కట్టదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రముఖులు హాజరు కానుండడంతో వేల సంఖ్యలో పోలీసులను మోహరించారు. అదేవిధంగా స్డేడియం పరిసర ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎల్‌బి స్టేడియం గుండా వెళ్లే మార్గాల్లో వాహనా దారులకు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు.
లక్డీకాపూల్ రవీంద్ర భారతి, ట్రాఫిక్ పోలీసు కంట్రోల్ మీద వచ్చే మార్గంతో పాటు బషీర్‌బాగ్, పాత పోలీసు కమిషనేరేట్ భవనం, నిజాం కాలేజ్ మార్గాల్లో అటు నుంచి గన్‌పౌండ్రి ఎస్‌బిఐ నుంచి బాబు జగ్జీవన్ రామ విగ్రహాం నాంపల్లి నుంచి పోలీసు కంట్రోల్ రూం వైపు వచ్చే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రత్యామ్నయ మార్గాలను గుండా వెళ్లాలని సూచించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పబ్లిక్ గార్డెన్ నుంచి ఎల్‌బిస్టేడియం వైపు, అదేవిధంగా బషీర్‌బాగ్ నుంచి నిజాం కాలేజ్ వైపు, గన్‌పౌండ్రి నుంచి బాబు జగ్జీవన్ రాం విగ్రహాం వైపు వచ్చే మార్గంలో వాహనాలను దారి మళ్లించిననట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ మార్గాల్లో దారి మళ్లీంపు
బషీర్‌బాగ్ నుంచి ఎల్‌బిస్డేడియం వైపు వచ్చే వాహనాలు కింగ్ కోఠి వైపు దారి మళ్లింపు
ఎస్‌బిఐ గన్‌పౌండ్రి నుంచి వచ్చే వాహనాలు చాపెల్ రోడ్ వైపు వెళ్లాల్సి ఉంటుంది.
కంట్రోల్ రూం నుంచి ఎల్‌బి స్టేడియం వైపు వచ్చే వాహనాలను నాంపల్లి వైపు దారి మళ్లింపు