- Advertisement -
హైదరాబాద్: ఖైరతాబాద్ బడా గణేష్ విగ్రహం పరిసరాల్లోని 2కిలో మీటర్ల మేరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ సుధీర్‌బాబు సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకునేందుకు భారీ ఎత్తున భక్తులు వస్తుండడంతో పోలీసులు ఆంక్షలు విధించారు. వివి స్టాట్యూ, షాదన్ నిరంకారీ, ఓల్డ్ సైఫాబాద్ పిఎస్, అయేధ్య, ఇక్బాల్ మినార్, తెలుగుతల్లి జంక్షన్, ఎన్‌టిఆర్ మార్గ్, నెక్లెస్ రోటరీ జంక్షన్ల నుంచి రెండు కిలో మీటర్ల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. వాహనదారులు ఈ జంక్షన్ల నుంచి మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రయాణించవద్దని కోరారు. ఈ ఆంక్షలు ఈ నెల 28వ తేదీ వరకు అమలులో ఉండనున్నట్లు పేర్కొన్నారు.
- Advertisement -