Sunday, December 22, 2024

నాపంల్లిలో ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

చేపమందు ప్రసాదం సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు ఈ నెల 8వ తేదీ 12 గంటల నుంచి 9వ తేదీ 6 గంటల వరకు అమలులో ఉండనున్నాయి. వాహనాదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని కోరారు.
చేపప్రసాదానికి వచ్చేవ వారు తమ ఫోర్ వీలర్లను గృహకల్ప, గగన్ విహార్, చంద్రవిహార్‌లో పార్కింగ్ చేయాలి.
చేపప్రసాదానికి బస్సులు, వ్యాన్లలో వచ్చేవారు ఎంజే మార్కెట్ నుంచి గాంధీ భవన్ బస్‌స్టాప్ వద్ద దిగి, గృహకల్ప బస్‌స్టాప్ నుంచి ఎగ్జిబిషన్ గేట్ నంబర్ 2 వద్ద తీసుకోవాలి.
విఐపి కార్ పాస్ ఉన్న వారు ఎంజే మార్కెట్ నుంచి అజంతా గేట్, గాంధీ భవన్ వద్ద ఎడమ వైపు నుంచి గేట్ నంబర్ 1, సిడబ్లూసి గేట్ మీదుగా విఐపి ఎంట్రీ గేట్ వైపు వెళ్లాలి. నాంపల్లి నుంచి వచ్చే వారు గాంధీభవన్ వద్ద యూ టర్న్ తీసుకుని తర్వాత లెఫ్ట్ తీసుకుని గేట్ నంబర్ 1, సిడబ్లూ సి గేట్ మీదుగా విఐపి ఎంట్రీ గేట్ నుంచి లోపలికి రావాలి. వాహనాలను విఐపి పార్కింగ్ ఏరియాలో నిలపాలి.

ప్రసాదం తీసుకున్న తర్వాత విఐపి కార్లు విఐపి గేట్, సిడబ్లూసి గేట్, ఆదాబ్ హోటల్ వద్ద లెఫ్ట్ తీసుకుని నాంపల్లి వైపు వెళ్లాలి.
బైక్‌లపై ఎంజే మార్కెట్ వైపు నుంచి వచ్చే వారు వాహనాలను మనోరంజన్ కాంప్లెక్స్‌లో పార్కింగ్ చేయాలి. నాంపల్లి నుంచి వచ్చే వారు రోడ్డుకు ఎడమ వైపు పార్కింగ్ చేయాలి.
ఆటోలో వచ్చే వారు షేహనాజ్ హోటల్, భవానీ వైన్స్, ఎక్సైజ్ ఆఫీస్ వైపు పార్కింగ్ చేయాలి.
ప్రభుత్వ వాహనాలను ఎంఏఏం గర్ల్ జూనియర్ కాలేజీ, నాంపల్లిలో పార్కింగ్ చేయాలి.
ఎంజే మార్కెట్ సైడ్ నుంచి వచ్చే వాహనాలను అబిడ్స్, జిపిఓ నాంపల్లి వైపు మళ్లిస్తారు.
చేపపిల్లలను తీసుకుని వచ్చే వాటర్ ట్యాంకర్లు గేట్ నంబర్ 3 నుంచి లోపలికి రావాలి.
భోజనం ఏర్పాటు చేసే వలంటీర్లు గేట్ నంబర్ 3 నుంచి లోపలికి రావాలి.
ఎంజే బ్రిడ్జి, బేగంబజార్ చత్రీ మీదుగా నాంపల్లి వైపు వచ్చే వాహనాలను అలస్కా మీదుగా దారుసలాం, ఎక్ మినార్ వైపు మళ్లిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News