Monday, December 23, 2024

నారాయణగూడలో ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

Traffic restrictions in Narayanguda

సదర్ ఉత్సవాల సందర్భంగా
ఆదేశాలు జారీ చేసిన జాయింట్ సిపి

హైదరాబాద్: సదర్ ఉత్సవాల సందర్భంగా నారాయణగూడలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ జాయింట్ పోలీస్ కమిషనర్ ఎవి రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 27వ తేదీ రాత్రి 7 గంటల నుంచి 28వ తేదీ తెల్లవారుజామున 3గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని కోరారు.  కాచిగూడ ఎక్స్ రోడ్డు నుంచి వైఎంసిఏ, నారాయణగూడ వైపు వచ్చే వాహనాలను టూర్టిస్ట్ హోటల్ కాచిగూడ ఎక్స్ రోడ్డు వైపు మళ్లిస్తారు. విట్టలవాడి ఎక్స్ రోడ్డు నుంచి వైఎంసిఏ, నారాయణగూడ వచ్చే వాహనాలను రాంకోఠి ఎక్స్ రోడ్డు భవాన్స్ న్యూసైన్స్ కాలేజీ, కింగ్ కోఠీ రోడ్డు వైపు మళ్లిస్తారు. స్ట్రీట్ నంబర్ 08 నుంచి వచ్చే వాహనాలను బర్కత్‌పుర, రెడ్డి కాలేజీ వైపు మళ్లిస్తారు.

ఓల్డ్ బర్కత్‌పుర పోస్ట్ ఆఫీస్ మీదుగా వైఎంసిఏ, నారాయణగూడ వచ్చే వాహనాలను క్రౌన్ కేఫ్ లేదా బాగ్‌లింగంపల్లి వైపు మళ్లిస్తారు. ఓల్డ్ ఎక్సైజ్ ఆఫీస్ లేన్ మీదుగా వైఎంసిఏ, నారాయణగూడ వైపు వచ్చే వాహనాలను విట్టల్‌వాడి వైపు మళ్లిస్తారు. బర్కత్‌పుర చమాన్ నుంచి వైఎంసిఏ, నారాయణగూడ వచ్చే వాహనాలు బర్కత్‌పుర ఎక్స్‌రోడ్డు లేదా టూరిస్ట్ హోటల్ వైపు మళ్లిస్తారు. బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ మీదుగా రెడ్డి కాలేజీ వైపు వచ్చే వాహనాలను నారాయణగూడ ఎక్స్ రోడ్డు వైపు మళ్లిస్తారు. సికింద్రాబాద్ నుంచి కోఠికి వెళ్లే ఆర్‌టిసి బస్సులు వైఎంసిఏ సర్కిల్, నారాయణగూడ ఎక్స్ రోడ్డు వైపు కాకుండా కాచిగూడ ఎక్స్ రోడ్డు, బర్కత్‌పుర, బాగ్‌లింగంపల్లి, విఎస్‌టి, ఆర్‌టిసి ఎక్స్‌రోడ్డు నుంచి వెళ్లాలి. సదర్ మేలాకు వచ్చే వారు వాహనాలను శాంతి థియేటర్, రెడ్డి కాలేజీ, మేల్కోటే పార్క్, దీపక్ థియేటర్ వద్ద పార్కింగ్ చేయాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News