Thursday, January 23, 2025

నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

Traffic restrictions in NTR marg

మనతెలంగాణ, హైదరాబాద్ : నగరంలో ఈ రేసింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో ఎన్‌టిఆర్ మార్గ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ జాయింట్ పోలీస్ కమిషనర్ ఎవి రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని కోరారు. వివి స్టాట్యూ జంక్షన్, నెక్లెస్ రోడ్డు రోటరీ, మింట్ కాంపౌండ్ రోడ్డు, తెలుగుతల్లి జంక్షన్, లుంబినీ పార్క్, ఎన్‌టిఆర్ గార్డెన్, సంజీవయ్య పార్క్ జంక్షన్లలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ జంక్షన్ల నుంచి వాహనదారులు ప్రయాణాలు మానుకోవాలని కోరారు.

అంబేద్కర్ విగ్రహం( ట్యాంక్‌బండ్, లిబర్టీ) నుంచి తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి నెక్లెస్ రోడ్డు రోటరీ వైప వచ్చే వాహనాలను తెలుగు తల్లి జంక్షన్ వద్ద డైవర్ట్ చేసి ఇక్బాల్ మినార్, మింట్ కాంపౌండ్ లేన్ నుంచి నెక్లెస్ రోడ్డు లేదా ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వైపు వెళ్లాల్సి ఉంటుంది.
ఇక్బాల్ మినార్ నుంచి తెలుగు తల్లి వచ్చేవాహనాలు లెఫ్ట్ తీసుకుని నెక్లెస్ రోటరీ లేదా ఎన్‌టిఆర్ మార్గ్, మింట్ కాంపౌండ్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వెళ్లాలి.
ఖైరతాబాద్ ఫ్లైఓవర్ నుమచి తెలుగుతల్లి వైపు వచ్చే వాహనాలను నెక్లెస్ రోటరీ నుంచి మింట్ కాంపౌండ్ లేన్ వైపు మళ్లిస్తారు. ఎన్‌టిఆర్ గార్డెన్‌ను ఆదివారం మూసివేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News