ఈ నెల17వ సాయంత్రం 4 గంటల నుంచి విధింపు
ఆదేశాలు జారీ చేసిన నగర సిపి సివి ఆనంద్
హైదరాబాద్: శ్రీ ఉజ్జయిని మహంకాళీ బోనాల జాతర సందర్భంగా సికింద్రాబాద్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు 17వ తేదీ ఉదయం సాయంత్రం 4 గంటల నుంచి 18వ తేదీ ఉదయం జాతర పూర్తయ్యే వరకు అమలులో ఉంటాయి. వాహనదారులు రాణిగంజ్, ఓల్డ్ రాంగోపాల్‌పేట పిఎస్, ప్యారడైజ్, సిటిఓ, ప్లాజా, ఎస్‌బిఐ ఎక్స్ రోడ్డు, వైఎంసిఏ ఎక్స్ రోడ్డు, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ ఎక్స్ రోడ్డు, ప్యాట్నీ ఎక్స్ రోడ్డు, పార్క్ లేన్, బాటా, గస్‌మండి ఎక్స్ రోడ్డు, బైబుల్ హౌస్, మినిస్టర్ రోడ్డు, రసూల్‌పుర ప్రాంతాల్లో రాకూడదని పేర్కొన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి రైలు ప్రయాణం చేసేవారు ముందుగానే చేరుకోవాలని, ఫ్లాట్ ఫాం 1 నుంచి ప్రయాణం చేసేవారు, చిలకలగూడ వైపు ఉన్న ఫ్లాట్ ఫాం 10 నుంచి వచ్చేందుకు ప్రయత్నం చేయాలని కోరారు. మహంకాళీ టెంపుల్ సమీపంలోని రెండు కిలో మీటర్ల వరకు ట్రాఫిక్ రద్దీగా ఉంటుందని పేర్కొన్నారు. మహంకాళీ టెంపుల్ నుంచి టొబాకో బజార్, హిల్ స్ట్రీట్ రోడ్డును మూసివేస్తారు. సుభాష్ రోడ్డు ప్రారంభం నుంచి బాటా ఎక్స్ రోడ్డు నుంచి ఓల్డ్ రాంగోపాల్‌పేట్ పిఎస్, సికింద్రాబాద్ రోడ్డును మూసివేస్తారు. మహంకాళీ టెంపుల్ నుంచి ఆదయ్య ఎక్స్ రోడ్డు సికింద్రాబాద్ రోడ్డు మూసివేస్తారు. మహంకాళీ టెంపుల్ నుంచి జనరల్ బజార్ సికింద్రాబాద్ రోడ్డు మూసివేస్తారు.
డైవర్షన్ పాయింట్లు….
కర్బాల మైదాన్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చే వాహనాలను రాణీగంజ్ ఎక్స్ రోడ్డు మీదుగా మినిస్టర్ రోడ్డు, రసూల్‌పుర ఎక్స్ రోడ్డు, పిఎన్‌టి ఫ్లైఓవర్, హెచ్‌పిఎస్ యూటర్న్, సిటిఓ, ఎస్‌బిఐ ఎక్స్ రోడ్డు, వైఎంసిఏ ఎక్స్ రోడ్డు, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్, గోపాలపురంలేన్, రైల్వే స్టేషన్.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ట్యాంక్ బండ్ వెపు వెళ్లే బస్సులు చిలకలగూడ ఎక్స్‌రోడ్డు, గాంధీ ఆస్పత్రి, ముషీరాబాద్ ఎక్స్ రోడ్డు, కవాడిగూడ, మారియట్ హోటల్, ట్యాంక్‌బండ్ వైపు వెళ్లాలి.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి తాడ్‌బన్, బేగంపేట నుంచి వచ్చే ఆర్టిసి బస్సులను క్లాక్ టవర్, ప్యాట్నీ ఎక్స్ రోడ్డు, వైఎంసిఏ రోడ్డు, ఎస్‌బిఐ ఎక్స్ రోడ్డు వైపు వెళ్లాలి.
ఘష్‌మండి ఎక్స్ రోడ్డు…
బైబిల్ హౌస్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, తిరుమలగిరి వైపు వెళ్లే వాహనాలను ఘష్‌మండి ఎక్స్ రోడ్డు మీదుగా సంజ్జన్‌లాల్ స్ట్రీట్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లేదా హిల్ స్ట్రీట్, రాణీగంజ్ వైపు వెళ్లాలి.
ప్యాట్నీ ఎక్స్ రోడ్డు…
ఎస్‌బిఐ ఎక్స్ రోడ్డు నుంచి ట్యాంక్‌బండ్ వచ్చే వాహనాలను ప్యాట్నీ ఎక్స్ రోడ్డు నుంచి ప్యారడైజ్, మినిస్టర్ రోడ్డు లేదా క్లాక్‌టవర్, సంగీత్ ఎక్స్ రోడ్డు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, చిలకలగూడ, ముషీరాబాద్ ఎక్స్ రోడ్డు, కవాడిగూడ, మారియట్ హోటల్, ట్యాంక్‌బండ్ వైపు వెళ్లాలి.
ప్యారడైజ్ నుంచి బైబిల్ హౌస్ వచ్చే వాహనాలను ప్యాట్నీ ఎక్స్ రోడ్డు వద్ద డైవర్ట్ చేసి ఎస్‌బిఐ లేదా క్లాక్ టవర్ మీదుగా వెళ్లాలి.
క్లాక్ టవర్ నుంచి ఆర్‌పి రోడ్డు మీదుగా వెళ్లే వాహనాలను ప్యాట్నీ ఎక్స్ రోడ్డు,ఎస్‌బిఐ ఎక్స్ రోడ్డు లేదా ప్యారడైజ్ మీదుగా వెళ్లాలి.
ప్యారడైజ్ ఎక్స్ రోడ్డు…
సిటిఓ జంక్షన్ నుంచి ఎంజి రోడ్డు మీదుగా వెళ్లే వాహనాలు ప్యారడైజ్ ఎక్స్ రోడ్డు, సింధీ కాలనీ, మినిస్టర్ రోడ్డు, రాణిగంజ్ ఎక్స్ రోడ్డు, కర్బాలా మైదాన్, ప్యాట్నీ ఎక్స్ రోడ్డు వైపు వచ్చే వాహనాలను ప్యారడైజ్ ఎక్స్ రోడ్డు వద్ద డైవర్ట్ చేసి సిటిఓ జంక్షన్ వైపు వెళ్లాలి.
ఎఫ్‌ఆర్‌ఓ లేదా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్లే వాహనాలు…
పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్లే వారు పంజాగుట్ట, ఖైరతాబాద్ జంక్షన్, ఐమ్యాక్స్ రోటరీ, తెలుగుతల్లి ఫ్లైఓవర్, లోయర్ ట్యాంక్‌బండ్, ఆర్‌టిసి ఎక్స్ రోడ్డు, ముషీరాబాద్ ఎక్స్ రోడ్డు, గాంధీ ఆస్పత్రి, చిలకలగూడ ఎక్స్ రోడ్డు, ప్లాట్‌ఫాం నంబర్ 10 నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లాలి.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఓల్డ్ గాంధీ ఎక్స్ రోడ్డు, మోండా మార్కెట్, ఘష్‌మండి, బైబిల్ హౌస్, కర్బాలా మైదాన్, ట్యాంక్‌బండ్‌కు వెళ్లాలి.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్యాట్నీ, ప్యారడైజ్ జంక్షన్, బేగంపేట, పంజాగుట్ట వైపు వెళ్లాలి.
ఉప్పల్ నుంచి పంజాగుట్ట…
ఉప్పల్, రామంతపూర్, అంబర్‌పేట, హిమయత్‌నగర్, ఖైరతాబాద్ జంక్షన్, పంజాట్టు వైపు రావాలి.
ఉప్పల్, తార్నాక, రైల్వే నిలయం, సంగీత్, వైఎంసిఏ,ప్లాజా, బేగంపేట, పంజాగుట్ట రోడ్డులో వాహనాలు వెళ్లకూడదు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సెయింట్ మేరీస్ రోడ్డు, క్లాక్ టవర్ రోడ్డు మూసి వేస్తారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి హకీంపేట, బోయిన్‌పల్లి, బాలానగర్, అమీర్‌పేట వేళ్లే బస్సులను అనుమతించరు. క్లాక్‌టవర్ నుంచి నుంచి బస్సులు ప్యాట్నీ, ఎస్‌బిఐ ఎక్స్ రోడ్డు నుంచి వెళ్లాలి.
పార్కింగ్ ప్రాంతాలు…
సెయింట్ జాన్స్ రోటరీ, స్వీకార్ ఉపకార్, ఎస్‌బిఐ నుంచి వచ్చే వాహనాలను హరిహర కళాభవన్ వద్ద పార్కింగ్ చేయాలి.
సెయింట్ జాన్స్ రోటరీ, స్వీకార్, ఉపకార్, ఎస్‌బిఐ నుంచి వచ్చే వాహనాలను మహబూబ్ కాలేజీ లేదా ఎస్‌విఐటి కాలేజీలో పార్కింగ్ చేయాలి.
సుభాష్ రోడ్డు నుంచి వచ్చే వాహనాలను ఓల్డ్ జైలు ఖానా ఓపెన్ ప్లేస్‌లో పార్కింగ్ చేయాలి.
కర్బాలా మైదాన్, బైబిల్ హౌస్, ఘన్‌స్‌మండి నుంచి వచ్చే వాహనాలను ఇస్లామియా హైస్కూల్‌లో పార్కింగ్ చేయాలి.
రాణీగంజ్, ఆదయ్య ఎక్స్ రోడ్డు నుంచి వచ్చే వాహనాలను ప్రభుత్వ ఆదయ్య మెమోరియల్ హైస్కూల్, ఆదయ్య ఎక్స్‌రోడ్డు, రాణిగంజ్, సికింద్రాబాద్‌లో పార్కింగ్ చేయాలి.
రసూల్‌పుర, సిటిఓ, బాలంరాయ్ నుంచి వచ్చే వాహనాలను మహాత్మగాంధీ స్టాట్యూ, ఎంజి రోడ్డులో పార్కింగ్ చేయాలి.
సెయింట్ జాన్స్ రోటరీ, స్వీకార్‌ఉపకార్, ఎస్‌బిఐ నుంచి వచ్చే వాహనాలను బెల్‌సన్ తాజ్‌హోటల్ వద్ద పార్కింగ్ చేయాలి.
మంజు థియేటర్ నుంచి వచ్చే వాహనాలను అంజలీ థియేటర్ వద్ద నిలపాలి.