Wednesday, January 22, 2025

ట్యాంక్‌బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

అంబేద్కర్ విగ్రహావిష్కరణ

హైదరాబాద్ : నగరంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ట్యాంక్‌బండ్ పరిసరాల్లో శుక్రవారం ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన 125 అడుగుల ఎత్తు విగ్రహాన్ని శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో నెక్లెస్‌రోడ్డు, ట్యాంక్‌బండ్, హుస్సేన్‌సాగర్, మింట్ కంపౌండ్ మార్గాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

మద్యాహ్నాం 1 గంట నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు. నెక్లెస్ రోడ్డు, కొత్త సచివాలం రోడ్డు వైపు వచ్చే వాహనాలను వివిధ మార్గాల్లో మళ్లించనున్నారు. వివి విగ్రహం( ఖైరతాబాద్), ఓల్డ్ సైఫాబాద్ పోలీస్ స్టేషన్ జంక్షన్, రవీంద్రభారతీ జంక్షన్, మింట్ కంపౌండ్ రోడ్డు, నెక్లెస్ రోటరీ, నల్లగుట్ట జంక్షన్, కట్టమైసమ్మ టెంపుల్(లోయర్ ట్యాంక్ బండ్), ట్యాంక్‌బండ్, లిబర్టీ జంక్షన్ వైపు వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని కోరారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు కోరారు.

అఫ్జల్‌గంజ్ నుంచి సికింద్రాబాద్ వైపు వచ్చే ఆర్టిసి బస్సులను ట్యాంక్‌బండ్ వైపునకు అనుమతించరు. ఈ మార్గంలో వచ్చే ఆర్టిసి బస్సులను రవీంద్రభారతి, తెలుగుతల్లి ఫ్లైఓవర్, కట్టమైసమ్మ టెంపుల్, లోయర్ ట్యాంక్‌బండ్, డిబిఆర్ మిల్స్, కవాడిగూడ మార్గాల్లో అనుమతించరు. ట్రాఫిక్ ఆంక్షల దృష్టా ప్రయాణికులు, వాహనదారులు ఈ మార్గాల్లో ప్రయాణించవద్దని, ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని కోరాఉ.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News