Monday, December 23, 2024

నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో: బక్రీద్ సందర్భంగా ఈ నెల 29వ తేదీన నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ద్ ఉల్ జుహా(బక్రీద్) ప్రార్థనలు నిర్వహించే మీర్ ఆలం ట్యాంక్ ఈద్గా, హాకీ గ్రౌండ్, మాసబ్ ట్యాం క్‌లో ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటలకు వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని పే ర్కొన్నారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని కోరారు.
— పురాణాపూల్, కామాటిపుర, కిషన్‌బాగ్ నుంచి నమాజ్ చేసేందుకు వచ్చే వారు ఈద్గా, మీరా ఆలం ట్యాంక్, బహదుర్‌పుర ఎక్స్ రోడ్డు నుంచి రావాలి. ఈద్గా, టాడ్‌బన్ నుంచి బహదురుపుర ఎక్స్ రోడ్డు మీదుగా కిషన్‌బాగ్, కామాటిపుర, పురాణాపూల్ వైపు వాహనాలను అనుమతించరు. నమాజ్‌కు వచ్చిన వారు జూపార్క్, ఓపెన్ స్పేస్ మ జీద్ అల్లాహో అక్బర్ వద్ద వాహనాలను పార్కింగ్ చేయాలి.
– – శివరాంపల్లి, దానమ్మ హట్స్ మీదుగా ఈద్గా, మీర్ ఆలం ట్యాంక్‌కు నమాజ్ కోసం వచ్చే వారిని ఉదయం 8గంటల నుంచి 11.30 గంటల వరకు దానమ్మ హట్స్ ఎక్స్ రోడ్డు మీదుగా అనుమతిస్తారు.

వాహనాలను దానమ్మ హట్స్ ఎక్స్ రోడ్డు మీదుగా శాస్త్రీపురం, ఎన్‌ఎస్ కుంటవైపు మళ్లిస్తారు. వాహనాలను మోడ్రన్ సామిల్, మీర్ ఆలం ఫిల్టర్ బెడ్, సుఫీ కార్స్, యాదవ్ పార్కింగ్‌లో పార్కింగ్ చేయాలి.
— కాలాపత్తర్ నుంచి నమాజ్ చేసేందుకు వచ్చే వారు ఈద్గా మీర్ ఆలం ట్యాంక్ నుంచి కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ వైపు అనుమతిస్తారు.

ఈ సమయంలో సాధారణ వాహనాలను కాలాపత్తర్ పిఎస్ నుంచి మోచీ కాలనీ, బహదుర్‌పుర, శంషీర్‌గంజ్, నవాబ్ సాహెబ్ కుంట వైపు మళ్లిస్తారు. వాహనాలను భయ్య పార్కింగ్, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్, విశాఖ సిమెంట్ షాపు వద్ద పార్కింగ్ చేయాలి.
— పురాణాపూల్ నుంచి బహదూర్‌పుర వైపు వచ్చే ఆర్టిసి బస్సులు, భారీ వాహనాలను పురాణాపూల్ దర్వాజ నుంచి జియాగూడ, సిటీ కాలేజీవైపు మళ్లిస్తారు.
— శంషాబాద్, రాజేంద్రనగర్, మైలార్‌దేవ్‌పల్లి మీదుగా బహదూర్‌పుర వైపు వేల్లే వాహనాలను ఆరాంఘర్
– లక్కిడికాపూల్ నుంచి మాసబ్ ట్యాంక్ వైపు వచ్చే వాహనాలను రోడ్డు నంబర్ 1,12 మీదుగా మాసబ్ ట్యాంక్ నుంచి అయోధ్య జంక్షన్ మీదుగా నిరంకారీ, ఖైరతాబాద్, వివి స్టాట్యూ, ఖైతరాబాద్ ఆర్టిఏ ఆఫీస్, తాజ్‌కృష్ణ హోటల్‌వైపు మళ్లిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News