Monday, December 23, 2024

ఈనెల 9న ఉప్పల్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఈ నెల 9వ తేదీన ఉప్పల్ స్టేడియంలో నిర్వహించ నున్న ఐపిఎల్ మ్యాచ్‌కు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 11.30 గంటల వరకు విధించారు. ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్ మధ్య ఐపిఎల్ మ్యాచ్ జరగనుంది. లారీలు, డంపర్, ఎర్త్‌మూవర్స్, వాటర్ ట్యాంకర్లు, ఆర్‌ఎంసి ట్రక్కులపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

వరంగల్ హైవే నుంచి చెంగిచెర్ల వచ్చే భారీ వాహనాలను చెంగిచెర్ల ఎక్స్ రోడ్డు వద్ద నుంచి చెర్లపల్లి ఐఓసిఎల్,ఎన్‌ఎఫ్‌సి వైపు మళ్లిస్తారు. ఎల్‌బి నగర్ నుంచి నాగోల్ వైపు వెళ్లే భారీ వాహనాలను నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద డైవర్ట్ చేసి హెచ్‌ఎండిఎ, బోడుప్పల్, చెంగిచెర్ల ఎక్స్ రోడ్డు వైపు మళ్లిస్తారు. మల్లాపూర్ నుంచి నాచారం వచ్చే భారీ వాహనాలను నాచారం ఐడిఎ వద్ద డైవర్ట్ చేసి నాచారం ఐడిఎ నుంచి చెర్లపల్లి, చెంగిచెర్ల వైపు మళ్లిస్తారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను గమనించి ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News