Saturday, November 2, 2024

రాజ్‌భవన్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -
Traffic restrictions in vicinity of Raj Bhavan
ఆదేశాలు జారీ చేసిన ట్రాఫిక్ అడిషనల్ పోలీస్ కమిషనర్

హైదరాబాద్: భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు శుక్రవారం రాజ్‌భవన్‌లో ఉదయం 9గంటలకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 8గంటల నుంచి మద్యాహ్నాం 12 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు అడిషనల్ సిపి తెలిపారు. ట్రాఫిక్‌ను మోనప్ప ఐస్‌ల్యాండ్, వివి స్టాట్యూ జంక్షన్, పంజాగుట్ట, రాజ్‌భవన్ క్వార్టర్స్ రోడ్డు రెండు వైపులా మూసివేయనున్నారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని కోరారు.

పార్కింగ్ ప్రాంతాలు….

జడ్జిలు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎంఎల్‌సిలు వాహనాలను గేట్ నంబర్ 3 అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ వద్ద పార్కింగ్ చేయాలి.
మీడియా వాహనాలను దిల్‌కుషా గెస్ట్‌హౌస్ వద్ద పార్కింగ్ చేయాలి.
ఎంఎంటిఎస్ రెసిడెన్సీ పార్కింగ్‌లో విఐపి వాహనాలు, ప్రభుత్వ వాహనాలను పార్కింగ్ చేయాలి.
మెట్రో రెసిడెన్సీ నుంచి నాసర్ స్కూల్ వరకు సింగిల్ లైన్‌లో పార్కింగ్ చేయాలి.
లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్ నుంచి వివి స్టాట్యూ జంక్షన్ వరకు సింగల్ లేన్‌లో వాహనాలను పార్కింగ్ చేయాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News