Sunday, December 22, 2024

భీమ్లానాయక్ ప్రీరిలీజ్ పంక్షన్.. యూసుఫ్‌గూడలో ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

Traffic restrictions in Yousufguda

 

హైదరాబాద్ : భీమ్లానాయక్ ప్రీరిలీజ్ ఫంక్షన్ సందర్భంగా యూసుఫ్ గూడలో బుధవారం ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. యూసుఫ్‌గూడలోని టిఎస్‌ఎస్‌పి మొదటి బెటాలియన్ గ్రౌండ్స్ బుధవారం సాయంత్రం 5గంటలకు భీమ్లా నాయక్ ప్రీరిలిజ్ ఫంక్షన్ నిర్వహించనున్నారు. మద్యాహ్నం 2గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని పోలీసులు కోరారు. నిర్వాహకులు జారీ చేసిన పాత పాసులు 21వ తేదీకి ఇచ్చిన వాటిని అనుమతించమని, వచ్చే వారు కొత్త పాసులు విత్ హోలో గ్రామ్ ఉన్న వాటిని తీసుకుని రావాలని పోలీసులు స్పష్టం చేశారు.

మైత్రీవనం నుంచి యూసుఫ్‌గూడ చెక్‌పోస్టు వైపు వచ్చే వాహనాలను సవేర ఫంక్షన్ హాల్ మీదుగా కృష్ణకాంత్ పార్క్, కళ్యాన్ నగర్, సత్యసాయినిగమాగమనం, కమలాపురి కాలనీ, కృష్ణానగర్, జూబ్లీహిల్స్ వైపు మళ్లించనున్నారు.
జూబ్లీహిల్స్ నుంచి యూసుఫ్‌గూడ చెక్‌పోస్టు వైపు వచ్చే వాహనాలను శ్రీనగర్‌కాలనీ, సత్యసాయినిగమాగమనం నుంచి మళ్లించనున్నారు.

పార్కింగ్ ప్రాంతాలు…..

సవేరా ఫంక్షన్ హాల్, మహమూద్ ఫంక్షన్ ప్యాలెస్, యూసుఫ్‌గూడ మె౬టో స్టేషన్ పార్కింగ్, ఓపెన్ గ్రౌండ్ ఆపోజిట్ సవేరా ఫంక్షన్ హాల్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, యూసుఫ్‌గూడ గవర్నమెంట్ స్కూల్.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News