ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు
హైదరాబాద్: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా శనివారం హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 10 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి నెక్లెస్ రోడ్డులోని జలవిహార్‌కు భారీ ర్యాలీ మధ్య సిన్హా చేరుకుంటారు. ర్యాలీ సందర్భంగా బేగంపేట్, లైఫ్‌స్టైల్, సోమాజిగూడ, ఖైరతాబాద్, ఐమాక్స్ రోటరీ, నెక్లెస్ రోడ్డు, జలవిహార్ రూట్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ జాయింట్ సిపి రంగనాథ్ తెలిపారు. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ట్రాఫిక్ రద్దీని బట్టి వాహనాల మళ్లింపు, ట్రాఫిక్‌ను నిలిపివేయడం జరుగుతుందని తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని కోరారు.
గ్రీన్‌ల్యాండ్స్ నుంచి రాజ్‌భవన్ రోడ్డు వైపు వచ్చే వాహనాలను మోనప్ప ఐలాండ్, రాజీవ్‌గాంధీ వద్ద పంజాగుట్టవైపు మళ్లిస్తారు.
ఖైరతాబాద్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వెళ్లే వాహనాలను ఖైరతాబాద్ జంక్షన్ నుంచి సాధన్ కాలేజీ వైపు మళ్లిస్తారు.
మినిస్టిర్ రోడ్డు నుంచి సంజీవయ్య పార్కు వైపు వెళ్లే వాహనాలను నల్లగుట్ట బ్రిడ్జి వద్ద నుంచి బుద్దభవన్, ట్యాంక్‌బండ్ వైపు మళ్లిస్తారు. మింట్ కంపౌండ్ నుంచి నెక్లెస్ రోడ్డు వైపు వచ్చే వాహనాలను సైఫాబాద్ ట్రాఫిక్ ఠాణా వద్ద ఖైరతాబాద్ బడా గణేష్ వైపు మళ్లిస్తారు.