Saturday, January 11, 2025

పబ్లిక్ గార్డెన్ సమీపంలో ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

Traffic restrictions near the Public Garden

ఈ నెల 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
ఆదేశాలు జారీ చేసిన జాయింట్ సిపి ఎవి రంగనాథ్

మనతెలంగాణ, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్ సమీపంలో ఈనెల 2వ తేదీన ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ జాయింట్ పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ ఎవి రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 2వ తేదీన నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్‌లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. వేడుకలు ఉదయం 7.30 గంటల నుంచి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. పాసులు ఉన్న వాహనాలను మాత్రమే వేడుకలు జరిగే ప్రాంతానికి అనుమతించనున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.

– తాజ్ ఐస్‌ల్యాండ్‌ః ఎంజే మార్కెట్ నుంచి పబ్లిక్ గార్డెన్ వైపు వచ్చే వాహనాలను తాజ్ ఐస్‌ల్యాండ్ మీదుగా ఎక్ మినార్, బజార్‌ఘర్, ఆసిఫ్‌నగర్, రెడ్ హిల్స్, అయోధ్య హోటల్, లకిడికాపూల్ మీదుగా వెళ్లాలి.

– చాపెల్ రోడ్డు టీ జంక్షన్‌ః నాంపల్లి రైల్వే స్టేషన్ మీదుగా పబ్లిక్ గార్డెన్ వైపు వచ్చే వాహనాలను చాపెల్ రోడ్డు టి జంక్షన్ మీదుగా గన్‌ఫౌండ్రీ, అబిడ్స్ లేదా బిజేఆర్ స్టాట్యూ , బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ మీదుగా వెళ్లాలి.

– సైఫాబాద్ ఓల్డ్ పిఎస్‌ః నిరంకారీ భవన్, ఖైరతాబాద్ మీదుగా రవీంద్రభారతీ వైపు వచ్చే వాహనాలను ఓల్డ్ సైఫాబాద్ పిఎస్ మీదుగా టెలిఫోన్ భవన్, ఇక్బాల్ మినార్, సెక్రటేరియట్ రోడ్డు, తెలుగుతల్లి, అంబేద్కర్ స్టాట్యూ, లిబర్టీ, బషీర్‌బాగ్, అబిడ్స్ మీదుగా వెళ్లాలి.

– బషీర్‌బాగ్ జంక్షన్‌ః హైదర్‌గూడ, కింగ్ కోఠి, బిజేఆర్ స్టాట్యూ, మీదుగా పిసిఆర్, పబ్లిక్ గార్డెన్ వైపు వచ్చే వాహనాలను బషీర్‌బాగ్ జంక్షన్ మీదుగా లిబర్టీ, తెలుగుతల్లి, ఎన్టీఆర్ మార్గ్, ఇక్బాల్ మినార్, ఓల్డ్ సైఫాబాద్ పిఎస్, లకిడికాపూల్ బ్రిడ్జి, బిజేఆర్ స్టాట్యూ, అబిడ్స్ వైపు వెళ్లాలి.

– ఇక్బాల్ మినార్‌ః ట్యాంక్ బండ్ నుంచి రవీంద్రభారతి వైపు వచ్చే వాహనాలను టెలిఫోన్ భవన్ రోడ్డు, ఓల్డ్ సైఫాబాద్ పిఎస్, లకిడికాపూల్ బ్రిడ్జి వైపు వెళ్లాలి.

– ఎఆర్ పెట్రోల్ పంప్‌ః సుజాత హైస్కూల్ నుంచి పబ్లిక్ గార్డెన్ వైపు వచ్చే వాహనాలను ఎఆర్ పెట్రోల్ పంపు మీదుగా బిజేఆర్ స్టాట్యూ వైపు మళ్లిస్తారు.

– ఆదర్శనగర్‌ః తెలుగుతల్లి, ఎన్టీఆర్ మార్గ్, లిబర్టీ వైపు నుంచి ఆదర్శనగర్ రోడ్డు నుంచి పోలీస్ కంట్రోల్ రూమ్ జంక్షన్ వైపు వాహనాలను అనుమతించరు. ఆదర్శనగర్ మీదుగా లిబర్టీ రోడ్డు, తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా వెళ్లాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News