Monday, December 23, 2024

ట్యాంక్‌ బండ్‌పై ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః సద్దుల బతుకమ్మ వేడుకల సందర్భంగా ట్యాంక్‌బండ్, లుంబినీ పార్క్ పరిసరాల్లో ఈ నెల 22వ తేదీన ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ సుధీర్‌బాబు ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమలులో ఉండనున్నాయి. ట్రాఫిక్ ఆంక్షల కారణంగా వాహనాలను మళ్లిస్తామని పేర్కొన్నారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గంలో వెళ్లాలని కోరారు.
ట్యాంక్‌బండ్ నుంచి తెలుగుతల్లి జంక్షన్, కర్బాల మైదాన్ వైపు వచ్చే వాహనాలను అనుమతించరు.
ఇక్బాల్ మినార్ నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు వచ్చే వాహనాలను తెలుగుతల్లి ఫ్లైఓవర్, కట్టమైసమ్మ, డిబిఆర్, ఇందిరాపార్క్, గాంధీ నగర్, ఆర్‌టిసి క్రాస్ రోడ్డు వైపు మళ్లిస్తారు.
వివి స్టాట్యూ నుంచి ఎన్‌టిఆర్ మార్గ్ వచ్చే వాహనాలను ఇందిరాగాంధీ స్టాట్యూ, ప్రసాద్ ఐ మ్యాక్స్, మింట్ లేన్ వైపు మళ్లిస్తారు.
నల్లగుట్ట జంక్షన్ నుంచి బుద్ధ భవన్ వైపు వచ్చే వాహనాలను నల్లగుట్ట క్రాస్ రోడ్డు, రాణిగంజ్, నెక్లెస్ రోడ్డు వైపు మళ్లిస్తారు.
లిబర్టీ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాహనాలను అంబేద్కర్ స్టాట్యూ మీదుగా ఇక్బాల్ మినార్ వద్ద యూ టర్న్ తీసుకుని తెలుగుతల్లి జంక్షన్ వైపు వెళ్లాలి.
సికింద్రాబాద్ నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు వచ్చే వాహనాలను కర్బాలా మైదాన్ మీదుగా బైబిల్ హౌస్, జబ్బార్ కాంప్లెక్స్, కవాడిగూడ, లోయర్ ట్యాంక్‌బండ్, కట్టమైసమ్మ, తెలుగు ఫ్లైఓవర్ వైపు వెళ్లాలి.
ముషీరాబాద్, కవాడిగూడ నుంచి చిల్డ్రన్ పార్క్, అప్పర్ ట్యాంక్ బండ్ నుంచి వచ్చే వాహనాలను డిబిఆర్ మిల్స్ నుంచి లోయర్ ట్యాంక్‌బండ్, కట్టమైసమ్మ వైపు మళ్లిస్తారు.
ముషీరాబాద్, కవాడిగూడ మీదుగా చిల్డ్రన్ పార్క్, అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాహనాలు డిబిఆర్ మిల్స్ మీదుగా లోయర్ ట్యాంక్‌బండ్, కట్టమైసమ్మ వైపు మళ్లిస్తారు.
ఆర్‌టిసి బస్సులు….
సికింద్రాబాద్ నుంచి ఎంజిబిఎస్ వైపు వచ్చే ఇంటర్ డిస్ట్రిక్ట్ ఆర్‌టిసి బస్సులను స్వీకర్, ఉపకార్ జంక్షన్ మీదుగా వైఎంసిఏ, సంగీత్, మెట్టుగూడ, తార్నాక, నల్లకుంట, ఫీవర్ ఆస్పత్రి క్రాస్ రోడ్డు, బర్కత్‌పుర, టూరిస్ట్ హోటల్, నింబోలి అడ్డా, చాదర్‌ఘాట్, రాంగమహల్, ఎంజిబిఎస్ వైపు మళ్లిస్తారు.
సిటీ బస్సులు కర్బాలా మైదాన్ మీదుగా బైబిల్ హౌస్, జబ్బార్ కాంప్లెక్స్, కవాడిగూడ క్రాస్ రోడ్డు, లోయర్ ట్యాంక్‌బండ్, కట్టమైసమ్మ నుంచి తెలుగుతల్లి ఫ్లైఓవర్ వైపు మళ్లిస్తారు.
రద్దీ ఉండే జంక్షన్లు…
వివి స్టాట్యూ, ఖైరతాబాద్, ఓల్డ్ పిఎస్ సైఫాబాద్, ఇక్బాల్ మినార్, తెలుగుతల్లి జంక్షన్, నెక్లెస్ రోటరీ, లిబర్టీ, రవీంద్రభారతీ, అంబేద్కర్ స్టాట్యూ, ట్యాంక్‌బండ్, కవాడిగూడ క్రాస్ రోడ్డు, కట్టమైసమ్మ, కర్బాలా మైదాన్, రాణిగంజ్, నల్లగుట్ట జంక్షన్లు రద్దీగా ఉంటాయి.
పార్కింగ్ ప్రాంతాలు…
సద్దుల బతుకమ్మ వేడుకలకు వచ్చే వారు వాహనాలను స్నోవరల్డ్, ఎన్‌టిఆర్ స్టేడియం, మీకోసం పార్కింగ్ ప్లేస్, ఎన్‌టిఆర్ గార్డెన్.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News