Thursday, December 5, 2024

బాలానగర్ పిఎస్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః శివాలయం, ఫతేనగర్, బాలానగర్ ఆర్‌సిసి బాక్స్ బ్రిడ్జి నిర్మాణం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ బాలానగర్ ట్రాఫిక్ ఇన్స్‌స్పెక్టర్ శనివారం ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు ఈ నెల 11వ తేదీ నుంచి జులై 26వ తేదీ వరకు అమలులో ఉండనున్నాయి. ట్రాఫిక్ ఆంక్షల సందర్భంగా పలు ప్రాంతాల్లో వాహనాలను దారి మళ్లించనున్నారు. ట్రాఫిక్ ఆంక్షలు 45రోజుల పాటు అమలులో ఉండనున్నాయి. వాహనదారులు ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని కోరారు.

ఫతేనగర్ మీదుగా భరత్‌నగర్ వచ్చే వాహనాలను ఫతేనగర్ పెలికాన్ సిగ్నల టి జంక్షన్,బాలనగర్ లెఫ్ట్‌టర్న్, నర్సాపూర్ ఎక్స్‌రోడ్డు లెఫ్ట్ టర్న్, దీన్‌దయాల్ నగర్ రైటర్న్, సనత్‌నగర్ రైల్వే స్టేషన్, భరత్‌నగర్ ఫ్లైఓవర్ వద్ద రైటర్న్ తీసుకోవాలి.
భరత్‌నగర్ మీదుగా ఫతేనగర్ వచ్చే వాహనాలు భరత్‌నగర్ ఫ్లైఓవర్ లెఫ్ట్ టర్న్, సనత్‌నగర్ రైల్వే స్టేషన్, దీన్‌దయాల్ నగర్,నర్సాపూర్ ఎక్స్ రోడ్డు లెఫ్ట్ టర్న్ తీసుకుని యూటర్న్ తీసుకోవాలి. కమలేస్ మేడ్చల్ యూటర్న్ తీసుకుని, టి జంక్షన్, బాలానగర్ లెఫ్ట్ టర్న్, ఫతేనగర్ వైపు వెళ్లాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News