Monday, December 23, 2024

సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

Traffic restrictions within Cyberabad

2,3 తేదీల్లో అమలు, ఆదేశాలు జారీ చేసిన సిపి స్టిఫెన్ రవీంద్ర

హైదరాబాద్: హెచ్‌ఐసిసిలో బిజేపి జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ఈ నెల 2,3వ తేదీల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న వివిఐపిలు, విఐపిలు సమావేశాల్లో పాల్గొననున్న నేపథ్యంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆంక్షలు విధించారు. కావూరి హిల్స్ నుంచి కొత్తగూడ జంక్షన్, హైటెక్‌సిటీ ఎంఎంటిఎస్ స్టేషన్ నుంచి ఐకియా రోటరీ వరకు ఉన్న ఆఫీసుల ఉద్యోగులు వర్క్‌టైన్ మార్చుకోవాలని, వీలుంటే వర్క్ ఫ్రం హోం చేసుకోవాలని పోలీసులు కోరారు. ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని కోరారు.

ట్రాఫిక్ ఆంక్షలు…
నీరూస్ జంక్షన్ నుంచి కొత్త గూడజంక్షన్, గచ్చిబౌలి జంక్షన్ నుంచి వచ్చే వాహనాలు సిఓడి జంక్షన్ నుంచి దుర్గం చెరువు, ఇన్‌ఆర్బిట్‌మాల్, ఐటిసి కోహినూర్, ఐకియా, బయోడైవర్సిటీ, గచ్చిబౌలి వెళ్లాలి, అలాగే వాహనాలు రావాలి, సైబర్ టవర్స్, హైటెక్స్ జంక్షన్ వైపు వాహనాలను రాకూడదు.
మియాపూర్, కొత్తగూడ, హఫీజ్‌పేట నుంచి హైటెక్ సిటీ, సైబర్ టవర్స్, జూబ్లీహిల్స్ వచ్చే వారు రోలింగ్ హిల్స్, ఎఐజి ఆస్పత్రి, ఐకియా, ఇన్‌ఆర్బిట్‌మాల్, దుర్గం చెరువు రోడ్డు వైపు వెళ్లాలి.
ఆర్‌సి పురం, చందానగర్ నుంచి మాదాపూర్, గచ్చిబౌలి వచ్చే వాహనాలు బిహెచ్‌ఈఎల్, నల్లగండ్ల, హెచ్‌సియూ,ఐఐఐటి, గచ్చిబౌలి రోడ్డు వైపు వెళ్లాలి, ఆల్విన్,కొండాపూర్ రోడ్డు వైపు రాకూడదు.
భారీ వాహనాలపై నిషేధం…
జెఎన్‌టియూ నుంచి సైబర్ టవర్స్.
మియాపూర్ నుంచి కొత్తగూడ.
కావూరిహిల్స్ నుంచి కొత్తగూడ.
బయోడైవర్సిటీ నుంచి జెఎన్‌టియూ.
నారాయణమ్మ కాలేజీ నుంచి గచ్చిబౌలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News