Monday, December 23, 2024

వాహనాదారులకు అలర్ట్: ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినం.. దొరికితే అంతే!

- Advertisement -
- Advertisement -

వాహనాదారులకు అలర్ట్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై పోలీసులు దృష్టి పెట్టారు. కఠిన చర్యలు తీసుకొనేందుకు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్ లో సాదారణంగా పలు ప్రాంతాల భారీ ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది. ఈ క్రమంలో కొందరు వాహనాదారులు రాంగ్ రూట్ లో వెళ్లటంతోపాటు సిగ్నల్స్ జంప్ చేసి వెళ్తుంటారు. దీంతో ప్రమాదాలు జరుగుతుండటంతో ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినంగా అమలు చేసేలా పోలీసులు కసరత్తు చేస్తున్నారు.

ఇప్పటివరకు డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లోనే డ్రైవింగ్ లైసెన్సులు రద్దయ్యేలా చేస్తున్న పోలీసులు, ఇకపై రాంగ్‌సైడ్ డ్రైవింగ్, అతివేగంగా వాహనాలు నడపటం వంటి ఘటనల్లోనూ అదే తరహా చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రూల్స్ ఉల్లంఘించేవారి లైసెన్సులు రద్దయ్యేలా కోర్టుల్లో అభియోగపత్రాలు దాఖలు చేయాలని ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించినట్లు సమాచారం. త్వరలోనే అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News