Friday, November 22, 2024

రోహింగ్యా మహిళల అక్రమ రవాణా గుట్టురట్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా కేసులో మయన్మార్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ ) ఛార్జిషీట్ దాఖలు చేసింది. నిందితులు మయన్మార్ లోని మౌంగ్‌డా జిల్లా నివాసితులైన రబీయుల్ ఇస్లాం, సోఫిఅలోమ్, మహ్మద్ ఉస్మాన్‌లుగా గుర్తించింది. ఎన్‌ఐఎ వివరాల ప్రకారం ఈ ముఠా సరైన పత్రాలు లేకుండా దేశం లోకి అక్రమంగా ప్రవేశించి , మానవ అక్రమ రవాణా చేస్తున్నారని ఎన్‌ఐఎ వెల్లడించింది. వీరు ఎక్కువగా బంగ్లాదేశ్ శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్న రోహింగ్యా యువతులను , విదేశీయులను లక్షంగా చేసుకుంటున్నారు.

తమ జాతి పురుషులతో వివాహం జరిపిస్తామని నమ్మించి , అనంతరం ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, జమ్ముకశ్మీర్, హర్యానా, తెలంగాణ రాష్ట్రాల్లో బలవంతపు వివాహాలకు విక్రయిస్తున్నారు. వారు వాడుతున్నవి నకిలీ ఆధార్ కార్డులని, వాటిని ఉపయోగించి వివిధ సిమ్ కార్డులు కొనుగోలు చేయడానికి , బ్యాంకు ఖాతాలు తెరవడానికి ఉపయోగిస్తున్నట్టు ఎన్‌ఐఎ పేర్కొంది. ఈ ఛార్జిషీట్‌తో 2023 నవంబరు 7న కేసును విచారించడం ప్రారంభించిన ఎన్‌ఐఎ… అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా రాకెట్‌ను వెలికి తీసేందుకు ఒక ముఖ్యమైన అడుగు వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News