Sunday, December 22, 2024

విషాదం… గుండెపోటుతో డిసిపి కుమారుడు మృతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : డిసిపి వెంకటేశ్వర్లు కుమారుడు చంద్ర తేజ్ (20) గుండెపోటుతో మరణించాడు. సోమవారం అర్ధరాత్రి చంద్రతేజ్ కు గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు అతన్ని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే మొదట్లో వైద్యుల చికిత్సకు స్పందించిన చంద్రతేజ్. మంగళవారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో డిసిపి వెంకటేశ్వర్లు ఇంట్లో విషాధ ఛాయలు అలుముకున్నాయి. చేతికి అందివచ్చిన కొడుకు హఠాత్తుగా గుండెపోటుతో మరణించటంతో చంద్రతేజ్ కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. చంద్రతేజ్ మృతదేహాన్ని కుటుంబసభ్యులు నల్లగొండ జిల్లాలోని స్వగ్రామానికి తరలించారు.

చంద్ర తేజ్ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి ప్రస్తుతం సొంత వ్యాపారంలో రాణిస్తున్నట్లు అతడి కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇటీవలే సంక్రాంతి పండుగ సందర్భంగా చంద్ర తేజ్ తన సొంత డబ్బులతో తండ్రి వెంకటేశ్వర్లుకు ఓ కారును బహుమతిగా ఇచ్చాడని, ఈ లోపే ఇలా మరణించాడని బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News