Monday, December 23, 2024

అచ్చెన్నాయుడు ఇంట విషాదం

- Advertisement -
- Advertisement -

అమరావతిటిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు  ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అచ్చెన్న తల్లి కళావతి కన్నుమూశారు. ఆదివారం నాడు 3 గంటల సమయంలో శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ స్వగృహంలో కళావతి తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్యం కారణంగా ఆమె చనిపోయినట్లు కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో ఉండగా అచ్చెన్నాయుడికి విషయం తెలియడంతో హుటాహుటిన ఇంటికి వెళ్లారు. కాగా.. కళావతమ్మ మృతిపట్ల టిడిపి అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు, జిల్లాకు చెందిన సీనియర్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం అచ్చెన్న ఇంటికి చంద్రబాబు వెళ్తారని తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో ఉండగా చంద్రబాబుకు విషయం తెలియగానే వెంటనే అచ్చెన్నకు ఫోన్ చేసి మాట్లాడినట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News