Monday, January 20, 2025

బతుకమ్మ వేడుకల్లో విషాదం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/జగదేవ్ పూర్: బతుకమ్మ పండుగ సందర్భంగా చెరువు మె ట్లను శుభ్రం చేస్తున్న క్రమంలో కాలుజారీ గ్రామ పంచాయతీ కార్మికులు గల్లంతైన సంఘటన మండలం పరిధిలోని తీగుల్ గ్రామంలో జరిగింది. తీగుల్ గ్రామంలోని పటేల్ చెరువు కట్ట బతుకమ్మ వద్ద పెరిగిన పిచ్చి చెట్లను తొలగించే క్రమంలో ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి గ్రామ పంచాయతీ కార్యాలయంలో పనిచేసే సపాయి కార్మికులు బా బు (25) , గిరిపల్లి భారతి (40), ఏళ్లం యాదమ్మ(43)లు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ భాను ప్రకాశ్‌రావు సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు భారీగా చెరువు వద్దకు చేరుకున్నారు. పూట గ్రామంలో విషాద ఛాయ లు అలుముకున్నాయి. ఒక్కరి మృతదేహాన్ని బయటకు తీయగా, మిగ తా వారి గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
మృతుల కుటుంబాలను ఆదుకుంటాం : మంత్రి హరీష్
సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తీగుల్ గ్రామంలో చోటుచేసుకున్న దుర్ఘటనపై మంత్రి హరీష్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దురదృష్టవశాత్తు జరిగిన ఈ సంఘటనపై విచార వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉండి ఆదుకుంటామని మంత్రి తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News