Thursday, January 23, 2025

గాజుల రామారంలో విషాదం: భార్య, పిల్లలను చంపి.. భర్త ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ సిటీలో విషాద సంఘటన చోటుచేసుకుంది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజుల రామారంలోని ఓ అపార్ట్ మెంట్ లో భార్య, ఇద్దరు పిల్లలను చంపి..  భర్త ఆత్మహత్య చేసుకున్నాడె. సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.

మృతులు మంచిర్యాలకు చెందిన వెంకటేష్(40), వర్షిణి(33).. వారి పిల్లలు షికాంత్(11), విహంత్ (3)లు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించిన పోలీసులు.. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించనున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News