- కడుపునొప్పితో బాలిక మృతి
- ఎమ్మెల్యే స్పందించి రోడ్డు వేయాలని గ్రామస్థుల వినతి
వెల్దుర్తి: వెల్దుర్తి మండలంలోని నూతన గ్రామపంచాయతీగా ఏర్పడినటువంటి మహమ్మద్‌నగర్ తండా పెద్దమ్మ గడ్డతండాకు చెందిన అక్షరను అస్పత్రికి తీసుకెళ్తుండగా కడుపునొప్పి ఎక్కువ అవడంతో మృతిచెందిందని అక్షర మేనమామ మలోవత్ హనుమంతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పెద్దమ్మ గడ్డ తండాకు చెందిన బాబు రేణుకలకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె అక్షర మృతిచెందడంతో తల్లితండ్రులు కన్నీరుమున్నీరై విలపిస్తున్న సంఘటనను చూడలేకపోయామని నాలుగు రోజుల నుంచి భారీగా కురుస్తున్న వర్షానికి అ ందుగులపల్లి నుంచి పెద్దమ్మ గడ్డ తండా వరకు మట్టి రోడ్డు వేశారని వర్షానికి బురదమయం అవడంతో ఎటువంటి వాహనాలు రాకపోకలు సరిగా లేకపోవడంతో ఆస్పత్రికి సరైన సమయానికి చేరుకోలేకపోవడం వల్ల అక్షర చనిపోయిందని రోదిస్తూ వివరించారు.
రోడ్డు బురదమయం అవడంతో పెద్దమ్మ గడ్డ తండాలోకి ఎటువంటి వాహనాలు రాకపోవడం వలన పెద్దమ్మగడ్డ తండా నుంచి అందుగులపల్లి వరకు నడుచుకుంటూ వెళ్లేసరికి కడుపునొప్పివిపరీతంగా అవ్వడంతో ఆస్పత్రి వెళ్లగానేచనిపోవడం జరిగిందని రోడ్డు గురించి గతంలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డికి పలుమార్లు పిర్యాదులు చేసిన పట్టించుకోలేదని కాంగ్రెస్ పాలనలో వేసినటువంటి రోడ్డేనని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయి ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నటువంటి ప్రభుత్వం పెద్దమ్మ గడ్డ తండా రోడ్డును పట్టించుకునే అధికారులేకానీ నాయకులే లేరని ఆయన అన్నారు. అక్షర చనిపోయినత ర్వాత పార్థివ దేహాన్ని అందుగులపల్లి గ్రామ శివారునుంచి పెద్దమ్మ గడ్డ తండా వరకు నడుచుకుంటూ చేతులపై తీసుకువెళ్లే పరిస్థితులు వచ్చాయని ఇకనైనా సంబందిత అధికారులు, నాయకులు నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి స్పందించి అందుగులపల్లి నుంచి పెద్దమ్మగడ్డ తండా వరకు రోడ్డు వేయాలని కోరారు.